ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్ (పార్ట్ టైం, ఫుల్ టైం) సీట్ల భర్తీకి నిర్వహించిన ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (ఏపీఆర్ సెట్) ఫలితాలు నవంబర్ 6న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆర్‌సెట్ హాల్‌టికెట్ నెంబర్, మొబైల నెంబర్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో 62 సబ్జెక్టుల్లో అక్టోబర్ 17 నుంచి 19 వరకు పరీక్షలను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. 


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


* ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌సెట్)-2022 వివరాలు..


విభాగాలు: సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ప్లానింగ్, లా అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ తదితరాలు.


అర్హతలు:  55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు) ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర రిజర్వేషన్కేటగిరీ అభ్యర్థులు 50శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.


దరఖాస్తు ఫీజు: సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు ఫీజుగా అభ్యర్ధులు జనరల్ రూ.1500,బీసీ రూ.1300 చెల్లించి ఆన్‌‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రెండు సబ్జెక్టుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
రూ.2000 ఆలస్య రుసుముతో అక్టోబరు 05,రూ.5000 ఆలస్య రుసుముతో అక్టోబరు 11 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం అక్టోబరు 10,11 తేదీలలో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.యూజీసీ నెట్, సీఎస్ఐఆర్; నెట్, గేట్, స్లెట్, జీప్యాట్, ఎంఫిల్ విద్యార్థులు రిసెర్చ్ మెథడాలజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.


పరీక్ష విధానం: ఆర్‌సెట్ అనేది కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్. బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్షలో జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.



పరీక్ష కేంద్రాలు: ఈ ఏడాది 14 పరీక్ష కేంద్రాలు అందులో ఆంధ్రప్రదేశ్ 13,తెలంగాణ 01. శ్రీకాకుళం, విజయవాడ, కడప, విజయనగరం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, ఒంగోలు, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, భీమవరం, తిరుపతి, హైదరాబాద్.



ముఖ్యమైన తేదీలు..


✦ నోటిఫికేషన్ వెల్లడి: ఆగస్ట్ 28,29.


✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:01.09.2022


✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరి తేదీ: 24.09.2022.


✦ రూ.2000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 25.09.2022 నుండి 05.10.2022 వరకు.


✦ రూ.5000, రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుముతో దరఖాస్తు తేదీలు: 06.10.2022 నుండి 11.10.2022 వరకు.


✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: అక్టోబర్ 10,11.


✦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 13.10.2022.


✦ పరీక్ష తేదీలు: 17.10.2022 నుండి 19.10.2022 వరకు.



Notification


Information Brochure APRCET – 2022


Website



Also Read:


క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షను పార్ట్ ఎ, పార్ట్ బి రెండు భాగాలుగా నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..