ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 5న జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఫలితాలు జూన్ 3న విడుదలయ్యాయి. ఎంపికైన విద్యార్థుల మెరిట్ కార్డులు త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలకు పంపనున్నారు. జాతీయ విద్యామంత్రిత్వ శాఖ నియమాల ప్రకారం ఎంపికైన విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో సేవింగ్స్ అకౌంటు తీసుకుని, తండ్రి లేదా తల్లిని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్ నెంబరును అకౌంటుకు జతపరచాలి. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఎంఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
AP NMMS ఫలితాల కోసం క్లిక్ చేయండి..
AP NMMS ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి..
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
NMMS స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్ 15, తెలంగాణ విద్యార్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకాగా.. జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుముతో జూన్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 19న వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..