AP Law CET 2025 : ఆంధ్రప్రదేశ్ లా సెట్‌ ఫలితాలు2025 ప్రభుత్వం విడుదల చేసింది. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ రెండింటిని కూడా నారా లోకేష్‌ విడుదల చేశారు. ఫలితాల వివరాలను లోకేష్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈసారి ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. టాప్‌టెన్‌లో ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు. 

2025లో నిర్వహించిన లా సెట్ ఫలితాల్లో 95శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.  27,253 మంది పరీక్ష రాస్తే  20,826 మంది అర్హత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మంత్రి నారా లోకేష్‌ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశం కోసం జూన్‌ 5న పరీక్ష నిర్వహించారు. ఈసారి లా పరీక్ష నిర్వహణ బాధ్యతను శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీ తీసుకుంది.  

లాసెట్‌ ఫలితాలను ఎలా చూడాలిలాసెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx ను సంప్రదించాలి. 

అక్కడ నాలుగు సెగ్మెంట్స్ కనిపిస్తాయి. అందులో రిజల్ట్స్‌ అనే సెగ్మెంట్‌పై క్లిక్ చేయాలి. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

రిజిస్ట్రేషన్ నెంబర్‌, లా సెట్‌ హాల్‌టికెట్‌ ఎంటర్‌ చేయాలి. 

రిజల్ట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ అవుట్‌ తీసుకొని పెట్టుకోవాలి. 

ర్యాంకు కార్డును కూడాడౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్, లా హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ అవసరం అవుతాయి.  మూడేళ్లు ఏపీ లాసెట్‌లో టాపర్స్ వీళ్లే  

వేముల వెంకట శివసాయి భార్గవి (అనకాపల్లి), ముదునూరి రామ్‌తేజ్‌ వర్మ (విశాఖ), పల్నాటి సత్యాంజనదేవి (ఏలూరు), వి. రమేష్‌ (రాయచోటి), బొప్పన శరత్‌చంద్ర (అవనిగడ్డ), దాసరి మాధవరావు (సత్తెనపల్లి), డీవీ సూర్య సత్య మహేంద్ర (ఉండ్రాజవరం), ఎం. మల్లికేశ్వరపు డి. సాయికృష్ణ (జి.కొండూరు), కిరణ్‌ కుమార్‌ సింగంశెట్టి (విజయనగరం), పాతూరు హరీష్‌ (రామవరప్పాడు)

ఐదేళ్ల లాసెట్‌ టాపర్స్‌ వీళ్లే  పల్లపు గ్రీష్మ(అన్నమయ్య జిల్లా), సింగమల భావన (తిరుపతి), భత్తుల సూర్యతేజ (నరసారావుపేట), నక్కా ఉదయచంద్ర (చీపురుపల్లి ), మరుపల్లి రమేష్‌ (పెందుర్తి), వెంకటరమణ (మదనపల్లి), లహరి ఎలుగూరి (విజయవాడ), సయ్యద్‌ అప్సానా జబాన్‌ (కల్లూరు ), ఆళ్ల యశశ్వి (గుంటూరు), మహమ్మద్‌ ఇంతియాజ్‌ (విజయవాడ)

పీజీఎల్‌సెట్‌లో టాపర్స్ వీళ్లే బైసని హరితశ్రీ(అద్దంకి) యనమల లోకేశ్వరి (ఒంటిమిట్ట), కొర్సపాటి ప్రశాంత్‌ (ఒంగోలు), శ్రావ్య గొర్లి (విశాఖ), రమీజ్‌ రాజా షేక్‌ (విశాఖ), ఎం.విజయమణికంఠ (శ్రీకాకుళం), సీహెచ్‌. ద్యానేష్‌ నాయుడు (విజయనగరం), నిమ్మకూరి రామకృష్ణ (పొన్నూరు), శ్రీరాం బొడ్డు (హైదరాబాద్‌), ఆర్‌. దుర్గా ప్రవీణ్‌ (రాజమహేంద్రవరం)