AP Intermediate exams: నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 19 వరకు కొనసాగనున్నాయి. ఇక మార్చి 2 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Continues below advertisement

AP Inter Exams 2024: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు  మార్చి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు (APBIE) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు (Inter First Year Exams) ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలను  (Inter Exam Centers) ఏర్పాటుచేశారు. ఇక మార్చి 2 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 57 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు 08645 277707, 1800 425 1531 నంబర్లతో ప్రత్యేక కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

Continues below advertisement

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం 4.73 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం 5.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను (AP Inter Halltickets) బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు సంబంధిత కాలేజీ యాజమాన్యాల ద్వారా పొందవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల కోసం ఇంటర్ బోర్డు పలు సూచనలు చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

పకడ్భందీగా ఏర్పాట్లు..
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే వివరాలు తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. 

ఇంటర్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

విద్యార్థులకు ముఖ్య సూచనలు..

➥ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్‌టికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లా్ల్సి ఉంటుంది.

➥ హాల్‌టికెట్‌తోపాటు తమ కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి. 

➥ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 

➥ అలాగే విద్యార్ధులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. 

➥ విద్యార్ధులు  క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు.

➥ పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి.

➥ మాల్‌ ప్రాక్ట్రీస్‌, కాపీయింగ్‌ను ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్‌ -25 ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు.

➥ ప్రతీ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుంది. 

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 1- శుక్రవారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 4 - సోమవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 6 - బుధవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 9 - శనివారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 12 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 14 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 16 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 19 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

Continues below advertisement
Sponsored Links by Taboola