AP Intermediate Supplementary Exam Results | అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌తో పాటు ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదల చేశారు. 1,35,826 మంది ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయగా, 97,963 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/  లో చెక్ చేసుకోవాలని సూచించారు. మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చు..

Continues below advertisement


ఏప్రిల్ నెలలో రెగ్యూలర్ రిజల్ట్స్..


ఏప్రిల్ నెలలో ఇంటర్మీడియెట్ రెగ్యూలర్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్ లో 70% శాతం విద్యార్థులు పాస్ కాగా, సెకండియర్‌లో 83% మంది విద్యార్థులు పాసయ్యారు. 2,03,904 మంది బాలురు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరుకాగా, 1,62,952 మంది పాసయ్యారు. 2,18,126 మంది బాలికలు పరీక్షలు రాయగా, 1,88,569 మంది పాసయ్యారు. సెకండియర్‌లో అబ్బాయిలు 80 శాతం పాస్ కాగా, అమ్మాయిలు 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ లో 13,710 మంది బాలురు సెకండియర్ పరీక్షలు రాయగా 9236 మంది పాసయ్యారు. 19,579 బాలికలలో 16,471 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 67 కాగా, బాలికలు 84 శాతం మంది పాసయ్యారు. 


ఇంటర్ ఫస్టియర్‌లో 2,38,107 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 1,56,258 మంది పాసయ్యారు. 2,49,188 మంది బాలికలు ఎగ్జామ్స్ రాయగా, 1,86,721 మంది పాసయ్యారు. బాలురు 66 శాతం మంది పాస్ కాగా, బాలికలు 75 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఒకేషనల్ లో 15,968 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, 7966 మంది పాసయ్యారు. 22,585 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 16,025 మంది పాసయ్యారు. అబ్బాయిలు ఉత్తీర్ణత శాతం 50 కాగా, అమ్మాయిలు 71 శాతం మంది పాసయ్యారు.