AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలను ఈసారి వాట్సాప్ ద్వార విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఫలితాలు విడుదల చేస్తే ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్లడమో, సెల్‌ఫోన్‌లోనో చూసుకునే వాళ్లు. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా ఫలితాలు విద్యార్థి తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్‌లకే పంపించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏప్రిల్ 10 నాటికి మూల్యాంకనం పూర్తి
ఇంటర్ పరీక్షలు ఈ మధ్య ముగిశాయి. మూల్యాంకనమం కూడా వేగంగా సాగుతోంది. మార్చి 17తో పరీక్షలలు పూర్తి అయ్యాయి. మార్చి 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 10 నాటికి పూర్తి కానుంది. మిగతా ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు
రెండు విధాల్లో ఫలితాలు
ఇప్పుడు ఈ ఫలితాలను రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఫలితాలు విడదలైన తర్వాత సంప్రదాయపద్ధతిలో నెట్‌లో నెంబర్ టైప్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే అంత కంటే ముందే తల్లిదండ్రులు, విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్ వాట్సాప్‌కు ఫలితాలు పంపిస్తారు.
నేరుగా విద్యార్థి ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కే ఫలితాలు
ఫలితాలు వచ్చిన పది నుంచి 20 నిమిషాల్లోనే ఫలితాలు విద్యార్థి ఇచ్చిన నెంబర్‌కు పంపించనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ మార్కులు పంపిస్తారు. రెండో సంవత్సరం చదువుతున్న వాళ్లకు రెండేళ్లకు సంబంధించిన మార్క్స్‌షీట్స్ పంపిస్తారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు.
సంప్రదాయపద్ధతిలో ఫలితాలు చూసుకోవచ్చు
వాట్సాప్ సర్వర్ బిజీ వల్లో లేదా ఇతర సాంకేతికత కారణాలతో వాట్సాప్‌లో ఫలితాలు ఆలస్యమైతే ఇంటర్ వెబ్‌సైట్ సహా ఇతర వెబ్‌సైట్‌లలో విద్యార్థి రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ టైప్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇప్పటికే మొదటిససారి వాట్సాప్ ద్వారానే విద్యార్థుకు తమ హాల్‌టికెట్స్ పొందారు. అందుకోసం వాళ్లు రోల్ నెంబర్, డేటాఫ్‌బర్త్ ఎంటర్ చేశారు. ఇప్పుడు ఫలితాలు కోసం ఏం చేయాల్సిన పని లేదు. మీరు రిజిస్టర్ చేసిన నెంబర్‌కే ఫలితాలు వస్తాయి.
మూల్యాంకనం చాలా వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో మూల్యాంకనం చేస్తున్నారు. ఈ మూల్యాంకనం కోసం 20వేలకుపైగా సిబ్బందిని మోహరించారు. ప్రతి పేపర్‌కు ముందే బార్ కోడ్ ఇవ్వడం వల్ల పొరపాట్లకు అవకాశం చాలా తక్కువ ఉంటుందని అధికారులుచెబుతున్నారు.
ఏంటీ వాట్సాప్ గవర్నెన్స్
ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్రపేరుతో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రయత్నం చేసింది. ఇందులో ఇప్పటికే 250కిపైగా సేవలు అందిస్తోంది. 9552300009 నెంబర్ సేవ చేసుకొని మెసేజ్ చేస్తే వివరాలు పొందొచ్చు. కరెంటు బిల్లు నుంచి దాదాపు చాలా సేవలు ఇక్కడ లభిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సమస్య లేకుండా ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. ఏప్రిల్ నుంచి వాట్సాప్‌లో లభించి సేవల సంఖ్యను 300కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.