ఏపీలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ మేరకు జనవరి 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ఇకపై ఆయా యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికి ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లిస్తోంది. వీటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్, సెంచూరియన్, భారతీయ, క్రియ, మోహన్‌బాబు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో ప్రభుత్వం కల్పించే కన్వీనర్ కోటా 35 శాతం ప్రవేశాలకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఇలా..
➥ క్రియాలో ఎంబీఏ, బీఏ, బీఎస్సీ కోర్సులకు రూ.70,000 గా నిర్ణయించింది.
➥సెంచూరియన్‌లో బీబీఏకు రూ.25,000 గా; ఎస్‌ఆర్‌ఎంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలకు రూ.30,000 గా; ఎంటెక్, ఎంబీఏలకు రూ.70,000 గా ఫీజులు నిర్ణయించింది.
➥ విట్‌లో బీకాం, బీఎస్సీ-ఎంఎస్సీ, బీఏ-ఎంఏలకు రూ.30,000, ఎల్‌ఎల్‌బీ, బీబీఏకు రూ.40,000; ఎంటెక్ ఫీజును రూ.70,000, ఎంఎస్సీకి రూ.50,000 గా ఫీజును ఖరారు చేసింది.
➥ భారతీయ వర్సిటీలో బీబీఏ, బీసీఏలకు రూ.25,000; బీఎస్సీ కోర్సుకు రూ.40,000, బీబీఏ+ఎంబీఏకు రూ.30,000; ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు రూ.40,000 చొప్పున ఫీజు నిర్ణయించింది.
➥ మోహన్‌బాబు వర్సిటీలో ఎంటెక్ ఫీజును రూ.70,000 గా నిర్ణయించగా.. బీసీఏకు రూ.25,000, ఎంసీఏకు రూ.40,000; బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం కోర్సులకు రూ.20,000 ఫీజును ఖరారుచేసింది. ఇక ఎంఎస్సీ కోర్సుకు రూ.30,000; బీబీఏ కోర్సుకు రూ.25,000; ఎంబీఏ కోర్సుకు రూ.40,000; బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సులకు రూ.35,000 గా ఫీజు నిర్ణయించగా.. ఎంఫార్మసీ ఫీజును రూ.70,000గా ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read:
AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే!
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల తేదీలను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. వీటిలో ఫిబ్రవరి 22న నిర్వహించాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 24న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. థియరీ పరీక్షలు యథావిధిగా షెడ్యూలు ప్రకారమే కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..