విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమి్ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకాగా.. జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆలస్య రుసుముతో జూన్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 19న వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు.
వివరాలు..
* డిప్లొమా (ఫిషరీస్ సైన్స్)
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్
సీట్ల సంఖ్య: 495 (ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 440).
సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీ, బీసీ-29 శాతం, ఎస్సీ-15 శాతం, ఎస్టీ-6 శాతం సీట్లు కేటాయించారు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.08.2023 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 31.08.2001 - 31.08.2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు:
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.05.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 12.06.2023.
➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.06.2023.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు తేదీ: 19.06.2023.
Also Read:
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు క్యాట్ లేదా మ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్/ మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 19 వరకు అవకాశం ఉంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) ఆన్‌లైన్ అండ్ హైబ్రిడ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ప్రవేశాలకు అర్హులు. ఆన్‌లైన్ విధానంలో జులై 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..