AP SSC Supplementary Exam Halltickets: ఏపీలో పదోతరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించకపోయినా విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫీజు చెల్లించని విద్యార్థుల హాల్‌టికెట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో 1.61 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరిలో 1.15 లక్షల మంది మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన ఫలితాలను విడుదల చేశామని ఆయన తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచామన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55,966 జవాబు పత్రాల పరిశీలనకు దరఖాస్తులు రాగా.. 43,714 పత్రాల ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వాటిని నెలాఖరు నాటికి అందుబాటులో ఉంచనున్నట్లు దేవానంద్ స్పష్టంచేశారు.
పదోతరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం..
ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24న ప్రారంభమయ్యాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఏవైనా తప్పులుంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లించపు గడువు ముగియగా.. రూ.50 ఆలస్య రుసుముతో మే 23 వరకు ఫీజు చెల్లించవచ్చు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పాఠశాలలవారీగా పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ మే 24: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1
➥ మే 25: సెకండ్ ల్యాంగ్వేజ్
➥ మే 27: ఇంగ్లిష్
➥ మే 28: మ్యాథమెటిక్స్
➥ మే 29: ఫిజికల్ సైన్స్
➥ మే 30: జీవ శాస్త్రం
➥ మే 31: సోషల్ స్టడీస్
➥ జూన్ 1న: కాంపోజిట్ విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష
➥ జూన్ 3న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష.
ALSO READ:
ఏపీ హార్టిసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టిసెట్-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టిసెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..