ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) మ్యాట్ (సెప్టెంబరు సెషన్)- 2022 ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మ్యాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు నమోదుచేసి ఫలితాలను పొందవచ్చు. 


MAT Result 2022 ఫలితాలు ఇలా పొందండి..


Step 1: మ్యాట్-2022 ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - mat.aima.in


Step 2: అక్కడ హోంపేజీలో ''MAT Sep 2022 Result'' లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 3: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు నమోదు చేసి 'SUBMIT' బటన్ మీద క్లిక్ చేయాలి. 


Step 4: మ్యాట్-2022 పరీక్ష ఫలితాలు కంప్యూటర్ తెరమీద కనిపిస్తాయి. ఫలితాలు చెక్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకోవాలి.


Step 5: ఫలితాలు ప్రింట్ తీసుకొని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 


MAT 2022 Result కోసం క్లిక్ చేయండి.. 



సెప్టెంబరు 4న పేపర్ ఆధారిత మ్యాట్ పరీక్ష, సెప్టెంబరు 18న కంప్యూటర్ ఆధారిత మ్యాట్ పరీక్షలను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్ (matibt@aima.in) లేదా ఫోన్ నెంబర్ (8130338839, 9599030586) ద్వారా సంప్రదించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబరు (011-47673020)లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించవచ్చు. 



మ్యాట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. భారతప్రభుత్వ మానవ వనరుల అభివద్ది మంత్రిత్వశాఖ 2003లో మ్యాట్ పరీక్షకు అనుమతినిచ్చింది. దేశంలోని బిజినెస్ స్కూల్స్‌ లేదా అంతర్జాతీయ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలకు మ్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న 600 బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలకు మ్యాట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. 



CUET PG ఫలితాలు వెల్లడి...
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీ (CUET PG) – 2022 పరీక్ష ఫలితాలు వెలుబడ్డాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇటీవలే ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు ఫలితాలు వచ్చేలోపు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. మార్కులపై ఓ అంచనాకు రావచ్చు.



 


ఇవి కూడా చదవండి..



⇒   జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?


⇒  
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?



⇒  
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..