పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్) 2023 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎయిమ్స్(న్యూఢిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్(బెంగళూరు), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), ఎస్‌సీటీఐఎంఎస్ టీ(తిరువనంతపురం)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో పీజీ (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్) సీట్లను భర్తీ చేస్తారు. ఈ ఏడాది ఎయిమ్స్ ఢిల్లీ పరీక్ష నిర్వహించనుంది.


వివరాలు..


* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)-2023


భారత్‌లో ఎయిమ్స్ సెంటర్లు: న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, నాగ్‌పుర్, పట్నా, రాయ్ పూర్, రిషికేశ్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్, కల్యాణి, బతిండా, గువాహటి, విజయ్‌పూర్, బిలాస్‌పూర్, మదురై, దర్భాంగా, కశ్మీర్, డియోఘర్, రాజ్‌కోట్, మనేతి, మణిపూర్, కర్ణాటక, బీబీనగర్, మంగళగిరి.


అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణత.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. మూడు గంటల వ్యవధి ఉంటుంది. సరైన సమాధానానికి ఒక మార్కు, మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)


ముఖ్యమైన తేదీలు..


* ప్రాథమిక సమాచార నమోదు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 26.09.2022.


* ప్రాథమిక సమాచార నమోదు, రిజిస్ట్రేషన్‌లో మార్పులకు అవకాశం: 30.09.2022 నుంచి 03.10.2022 వరకు.


* రిజిస్ట్రేషన్, ప్రాథమిక సమాచార ఆమోదం: 06.10.2022.


* పూర్తిచేసిన దరఖాస్తు సమర్పణ, మార్పులకు అవకాశం: 12.10.2022 నుంచి 25.10.2022 వరకు.


* ధ్రువపత్రాల అప్‌లోడింగ్ తేదీలు: 12.10.2022 నుంచి 13.11.2022 వరకు.


* దరఖాస్తు పరిశీలన తేదీలు: 28.10.2022 నుంచి 31.10.2022 వరకు.


* పరీక్ష తేది: 13.11.2022.


 


Notification

Online Application



Website


 


Also Read:


BRAOU: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.
దరఖాస్తు, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..