AIIMS Jodhpur MPH Admissions: జోధ్‌పుర్‌ని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జనవరి 2024 సెషన్ ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు వివరాలు..
మొత్తం సీట్లు: 20
* ఫుల్ టైమ్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్
వ్యవధి: ఫుల్ టైం రెండేళ్ల కోర్సు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800. యూఆర్/ ఓబీసీలకు రూ.1000.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ముఖ్య తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 19.10.2023.
➥ హాల్ టికెట్ డౌన్‌లోడ్: 06.11.2023.
➥ ప్రవేశ పరీక్ష తేదీ: నవంబర్ 2023.
➥ సెషన్ ప్రారంభం: 11.01.2024.
ALSO READ:
బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో బీఎన్‌వైఎస్ కోర్సు, వివరాలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎన్‌వైఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(బైపీసీ) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 12లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో పీజీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్' కౌన్సెలింగ్, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్ విభాగంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..