ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రూ) అగ్రిసెట్‌– 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించనుంది. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపింది. 


ఆసక్తి గల వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 13వ తేదీతో ముగియనుంది. అగ్రిసెట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం http://www.angrau.ac.in/ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియలపై సందేహాలు ఉంటే 9440137105 హెల్ప్ లైన్ నంబరును సంప్రదించవచ్చు. 


సెప్టెంబర్ 13న పరీక్ష.. 
2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి 17 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. అగ్రిసెట్ పరీక్షను సెప్టెంబర్ 13న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ చాయిస్) మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 


దరఖాస్తు ఫీజు.. 
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.600, మిగతా వారు రూ.1200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో ఆగస్టు 17, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1800, మిగతా వారు రూ.2400 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. హాల్ టికెట్లను ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ప్రవేశాలు కోరుతున్న వర్సిటీలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 


ఆగస్టు 13వ తేదీ లోగా.. 
ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఆగస్టు 13, 2021గా ఉంది. ఈ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకుని, ఫీజు చెల్లించాలి. అనంతరం దరఖాస్తు కాపీలను డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల హార్డ్ కాపీతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర డాక్యుమెంట్లను క్రింది చిరునామాకు పోస్ట్ చేయాలి. దీనిని ఆగస్టు 21వ తేదీలోగా పంపాలి. 
"ద కన్వీనర్- అగ్రిసెట్- 2021, 
ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 
ఆర్ఏఆర్ఎస్, ఎల్ఏఎం, 522034, 
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్."