ఆంధ్రప్రదేశ్‌లో గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అవసరమైన చోట ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ఆగస్టు 8న ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్రంలో మొదట స్కూల్ కాంప్లెక్స్, మండలం, డివిజన్ ఇలా ప్రాధాన్య క్రమంలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. పురపాలక పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను పురపాలక లేదా దగ్గర్లోని ఇతర యాజమాన్య పాఠశాలల్లోనూ సర్దుబాటు చేస్తారు. అవసరం, అదనం ఆధారంగా ఈ సర్దుబాటు ఉంటుంది.


మున్సిపాలిటీ పరిధిలోని టీచర్లకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల గడువును పొడిగించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వారికి హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలోపు జీతాలు ఇప్పిస్తామని తెలిపారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 జాబ్ ఛార్ట్‌పై వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇటీవల బదిలీ పొంది రిలీవ్ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్ చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. 


ఉపాధ్యాయులపై పనిభారం పెంచడం, సెక్షన్ పరిమాణాన్ని 50 శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు విన్నవించారు. ఎంఈఓలు ఇద్దరికీ సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టీయూ కోరింది. అంతర్ జిల్లాల బదిలీలు, డీఎస్సీ-2003, పాత పింఛన్ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య విన్నవించింది. 


ALSO READ:


వర్శిటీల్లో పోస్టుల భర్తీకి ఆగస్టు 23న నోటిఫికేషన్ - 3925 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్‌ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్‌ ప్రభుత్వం. నవంబర్‌ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు,  ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ  చేస్తారు.  ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్‌ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం సూచించారు.  ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  ద్వారా మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.     
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్ల పంచాయతీ - బీ, సీ కేటగిరీ సీట్లపై పిటిషన్‌ దాఖలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీట్ల పంచాయతీ కోర్టు మెట్లెక్కింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..