Adilabad Students: ఆదిలాబాద్ జిల్లా యాపల్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. ప్రోత్సాహంతో 5వ తరగతి విద్యార్థులు ఏకంగా ఇంగ్లిష్ కథల పుస్తకాన్ని రాశారు. దీన్ని ఫిబ్రవరి 11న ఎన్టీఆర్ గార్డెన్‌లో జరుగనున్న పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి బాలసాహిత్య రచయితలు డా.వీఆర్ శర్మ, డా.గిరిపెల్లి అశోక్‌ల నుంచి అనుమతి లభించింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్ గూడలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బుక గంగయ్య పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.


విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించాలనే ఆలోచనతో గంగయ్య రోజువారీ పాఠ్యాంశాల బోధనలో భాగంగా ఆటపాటల మాదిరిగా వివిధ పాత్రలతో కూడిన కథలను వివరించడం, వాటినే తిరిగి రాయించడంతో పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో అయిదో తరగతి విద్యార్థులు 18 మంది ఆంగ్లంలో కథలు రాశారు. వాటిలో తొలుత కొన్ని తప్పులు, అన్వయ, వ్యాకరణ దోషాలను గుర్తించిన గంగయ్య వాటిని సరిచేస్తూ తిరిగి ఇంటిపనిగా రాయించడంతో విద్యార్థుల్లో పరిణితి వచ్చింది. తర్వాత వారు రాసిన వాటన్నింటినీ క్రోడీకరించి 'ది  స్టోరీస్ ఆఫ్ యాపల్ గూడ చిల్డ్రన్' పేరిట పుస్తకాన్ని ముద్రించారు.


పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తురాటి గంగన్న అందించిన ప్రోత్సాహం, విద్యార్థుల ఆసక్తితో పుస్తకం తీసుకురావడం ఆనందంగా ఉందని గంగయ్య పేర్కొన్నారు. పుస్తకంలో పిల్లలు రాసిన కథలన్నీ నేటి తరానికి దిశానిర్దేశం చేసేలా ఉన్నాయి. ఆధునిక పేర్లతో పాత్రలకు ప్రాణంపోసి చిన్న పదాలతో సంభాషణలుగా రాశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి, ప్రజల జీవన విధానం, స్నేహం ప్రాముఖ్యత, పేద ధనిక తారతమ్యం, పరోపకారం వంటి ఇతివృత్తాలను స్పృశించడం విశేషం.


ALSO READ:


CBSE Exams Admut card: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


TSRJC CET 2024: టీఎస్​ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...