ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా కోర్సు.. దరఖాస్తు గడువును పొడిగించారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తు గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు గుంటూరుకు చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రూ) రిజిస్ట్రార్ గిరిధర కృష్ణ వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం http://www.angrau.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించారు.


ఈ నెల 13న అగ్రిసెట్‌ 2021 పరీక్ష..
అగ్రిసెట్‌ 2021 పరీక్ష ఈ నెల 13న జరగునున్నట్లు ఆంగ్రూ వర్సిటీ ప్రకటించింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ చాయిస్) పరీక్ష ఉంటుందని పేర్కొంది. కాగా ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 


ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ తెలిపింది. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కోర్సుల్లో పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. 


అగ్రిసెట్ 2021 నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరవచ్చు.  


నీట్ యూజీ పరీక్ష హాల్ టికెట్లు రిలీజ్... 
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీలలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ 2021 పరీక్షల అడ్మిట్ కార్డు రిలీజ్ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు neet.nta.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి.. తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. 


నీట్ యూజీ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా.. 



  • నీట్ అధికారిక వెబ్‌సైట్‌ neet.nta.nic.inలో లాగిన్ అవ్వాలి. 

  • వెబ్‌సైట్‌లో ఉన్న డౌన్‌లోడ్ నీట్ యూజీ 2021 అడ్మిట్ కార్డు (Download NEET UG 2021 Admit Card) అనే లింక్ మీద క్లిక్ చేయాలి. 

  • ఇందులో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ వివరాలు ఇచ్చి.. సబ్మిట్ చేయాలి. 

  • దీంతో అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది.

  • పరీక్ష, భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. 


Also Read: Inter Online Admissions: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్ రద్దు... ఏపీ హైకోర్టు కీలక తీర్పు... ఈ ఏడాదికి పాత విధానమే...


Also Read: Telangana Inter: ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ఖరారు.. పరీక్షలు, సెలవులు ఈ తేదీల్లో..