ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ కొనసాగిస్తున్నారు. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ఇంటర్‌ మార్కులు 25% వెయిటేజీని పునరుద్ధరించారు. ఈఏపీసెట్‌లో వచ్చే మార్కులు 75%, ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్‌లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరనే నిబంధన ఉంది.


ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 70శాతం సిలబస్‌నే విద్యార్థులు చదివినందున ఈఏపీసెట్‌లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది మే 15 నుండి 23 తేదీల మధ్య ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్షను మే 22, 23 తేదీల్లో మధ్య నిర్వహించనున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 10న వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ పరీక్షను  జేఎన్‌టీయూ-అనంతపురం నిర్వహించనుంది.


ఏపీఈఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 11న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 15తో గడువు ముగిసింది. అయితే ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. రూ.1000 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో మే 6 నుంచి 12 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 13 నుంచి 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో సవరణకు మే 4 నుంచి 6 వరకు అవకాశం కల్పించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 7 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.  మే 15 నంచి 18 వరకు ఎంపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే మే 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్ విభాగాలకు పరీక్ష నిర్వహిస్తారు.  


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 10.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023


➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023


➥ రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.05.2023


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 04.05.2023 to 06.05.2023. 


➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.05.2023.  


➥ రూ.10,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.05.2023. 


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 09.05.2023. 


➥ ఏపీఈఏపీ సెట్-ఎంపీసీ స్ట్రీమ్ (ఇంజినీరింగ్) విభాగాలకు: మే 15 నంచి 18 వరకు. 


➥ ఏపీఈఏపీ సెట్-బైపీసీ స్ట్రీమ్ (అగ్రికల్చర్ & ఫార్మసీ) విభాగాలకు: మే 22, 23 తేదీల్లో. 


➥ పరీక్ష సమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.3 గం.-సా.6 గం. వరకు.


➥ ప్రిలిమినరీ కీ: 24.05.2023 9.00 am. 


➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 9.00 am - 26.05.2023 9.00 am


ఏపీఈఏపీ సెట్ నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


కొత్త డిగ్రీలు ఇక నాలుగేళ్లు! వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు!
తెలంగాణలో ఇకపై డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో (ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు) ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్ని దశల వారీగా అమలు చేయబోతున్నట్లు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం(2023-24) నుంచి మూడేళ్ల వ్యవధితో కంప్యూటర్‌ సైన్స్‌లో బీఎస్‌సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని నాలుగేళ్లకు పెంచనున్నారు. ఈ కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ను ఒక సబ్జెక్టుగా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా సిలబస్‌కు రూపకల్పన చేస్తున్నారు. కృత్రిమమేధ, సైబర్‌సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ తదితర అంశాలను ఇందులో బోధిస్తారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సీయూఈటీ పీజీ - 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్‌ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..