జేఈఈ మెయిన్-2022 సెషన్-2 పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) స్కోరుకార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. స్కోరు కార్డును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ మార్కుల వివరాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలను నమోదుచేసి స్కోరుకార్డును పొందవచ్చు.
స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ 2022 సెషన్-2 మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జులై 28 నుంచి 30 వరకు నిర్వహించింది. జులై 28, 29 తేదీల్లో పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష, జులై 30న పేపర్-2 (బీఆర్క్/బీప్లాన్) పరీక్షలు నిర్వహించింది. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,29,778 మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.
జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు. ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు.
Also Read:
Also Read:Foreign Education: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఒక్కరోజులోనే వీసా!బ్రిటన్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..