Reservations for orphans: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనాథలకు (orphans) 2 శాతం (2% Reservation) కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అధికారులకు ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో దత్తత తీసుకునే నిబంధనలు సులభతరం చేయాలని ఆమె అధికారులకు  సూచించారు. 


జనవరి 2న సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పిల్లల రక్షణ యూనిట్స్‌కు ట్రైనింగ్‌ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా డిపార్ట్‌మెంట్‌ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్‌ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా  హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.


అంగన్ వాడీల బలోపేతంపై ఫోకస్..
అంగన్ వాడీ కేంద్రా ల బలోపేతం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేవిధంగా అధికారులు చొరవ చూపాలనన్నారు. అంగన్‌వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు.  ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులలా పనిచేస్తూ.. శాఖను బలోపేతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 


ఇక ఇతర ప్రాంతాల నుండి పనికోసం వచ్చే మహిళల కోసం ముఖ్యమైన పెద్ద నగరాల్లో మహిళా సంక్షేమ శాఖ తరపున హాస్టల్స్ ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రతి జిల్లాలో వృద్దాశ్రమాల ఏర్పాటు చేయాలని అధికారులను సీతక్క ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. అంగన్వాడి కేంద్రాల బలోపేతం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీలలో ప్రీ స్కూల్ పెట్టే అంశంపై అధికారులు ఆలోచన చేయాలన్నారు.


స్త్రీనిధి పెండింగ్‌ రుణాలు ఇవ్వండి..
స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల రుణాలను వెంటనే పంపిణీ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అధికారులను ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎక్కువ రుణాలు ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. స్త్రీనిధి క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ పనితీరుపై మంగళవారం(జనవరి 2) ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రహదారుల వెంట పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారులకు షెడ్డులు ఏర్పా టు చేయాలని, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగే విధంగా చొరవ చూపాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అవసరాలు గుర్తించేందుకు స్టడీ టూర్‌ నిర్వహించాలని, మహిళలంతా స్వయం సహాయక సంఘాల్లో చేరేలా చూడాలని సూచించారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...