Just In





AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31రోజున జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 1కు పోస్టుపోన్ చేశారు.

AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక గమనిక. నెల 31న అంటే సోమవారం రాయాల్సిన 1న సోషల్ స్టడీస్ పరీక్ష ఒకరోజు వాయిదా పడింది.
31-03-2025 (సోమవారం)న ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి సోషల్ స్టడీస్ పరీక్ష 01-04-2025 న అంటే(మంగళవారం)న నిర్వహిస్తామన్నారు ఏపీ పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజ్ ఐఏఎస్. పరీక్ష తేదీలోని ఈ మార్పుని ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, స్కూల్ హెడ్మాస్టర్లు, సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్లు, పోలీస్ శాఖ, ట్రెజరీ సిబ్బంది, పోస్టల్ శాఖ, ఇతరులతో సహా అన్ని లైన్ డిపార్ట్‌మెంట్‌ల సిబ్బందికి తెలియజేయాలని ఆర్జేడీ, డీఈవో తదితర అధికారులకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా డైరెక్టర్ సూచించారు. ఈ నేపథ్యంలో మెటీరియల్, ప్రశ్నాపత్రాలు తీసుకెళ్లడానికి ఈ నెల 31న నిల్వ కేంద్రాల (స్టోరేజీ పాయింట్లు) వైపు వెళ్లొద్దన్నారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి సోషల్ స్టడీస్ పరీక్షను సోమవారం బదులుగా మంగళవారం రాయడానికి ప్రిపేర్ కావాలని ఆయన తెలిపారు.
శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలో 98.65 శాతం హాజరు
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన జీవ శాస్త్ర (బయాలజికల్ సైన్స్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది అని పాఠశాల విద్య సంచాలకులు విజయ్ రామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 6,36,241 మంది విద్యార్థులకు గానూ 6,27,673 మంది విద్యార్థులు హాజరు కాగా, 8345 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 1376 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒక విద్యార్థి చూసి రాస్తుండగా పట్టుబడ్డాడని, ఆ విద్యార్థిని డిబార్ చేసి సంబంధించిన ఇన్విజిలేటరును సస్పెండ్ చేశామన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ తెలిపారు.
ఆది, సోమవారాల్లో రెవెన్యూ మున్సిపల్ శాఖలు పని చేస్తాయి : ఏపీ ప్రభుత్వం
ఉగాది, రంజాన్ సందర్భంగా సెలవు ఉంటుందని భావించిన రెవెన్యూ మున్సిపల్ శాఖలను ఆ రెండు రోజులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం ఆఖరు కాబట్టి స్థిరాస్థి విక్రయాలు కొనుగోలుకు వీలు పడేలా ఆ రెండు రోజులు రెవెన్యూ శాఖ, ఇంటి పన్ను చెల్లించేందుకు వీలుగా మున్సిపల్ శాఖలో కొన్ని ప్రత్యేక కౌంటర్లు మార్చి 30 31 తారీఖుల్లోనూ పని చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. దానితో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష కూడా 31న జరిపేస్తారని కొందరు ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మార్చి 31న పరీక్షలు ఉండదని దానికి బదులు ఏప్రిల్ ఒకటిన పరీక్ష జరుగుతుందని స్పష్టత ఇచ్చింది.