YSRCP leader amzad bashas brother Ahmed basha arrest | ముంబై: వైసీపీ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్టయ్యారు. ముంబై ఎయిర్పోర్టులో అమలు బాషా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. అహ్మద్ బాషా పై ఇదివరకే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో బొంబాయి ఎయిర్ పోర్ట్ నుంచి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అహ్మద్ బాషాను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అహమ్మద్ బాషాను కడప పోలీసులు ముంబై నుంచి ఏపీకి తీసుకొస్తున్నారు.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని, మరికొందరిని దూషించిన కేసులో అహ్మద్ బాషా నిందితుడిగా ఉన్నారు. కడపలోని వినాయక నగర్లో ఓ స్థలం విషయంలో దాడి చేసినట్లు సైతం అహ్మద్ బాషా మీద కేసు నమోదు అయింది. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న అహ్మద్ బాషా మీద లోకౌట్ నోటీసులు జారీ కావడం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషాను సోమవారం కోటలో హాజరు పరిచయం అవకాశం ఉంది.