Tiger Wandering in Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి - అంకుసాపూర్ ప్రధాన రోడ్డుపై ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ పులిని ఢీకొట్టాడు. బైకు పులిని ఢీకొనడంతో ఉలిక్కి పడ్డ పులి అడిలోకి పారిపోయింది. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
కాగజ్ నగర్ పట్టణానికి చెందిన తాహెర్ అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం వాంకిడి నుంచి అంకుసాపూర్ మీదుగా కాగజ్ నగర్ కు వస్తున్నాడు. కాగజ్‌నగర్ కి ఐదు కిలో మీటర్ల దూరంలోకి రాగానే ఒక్కసారిగా పులిరోడ్డు దాటుతూ తాహెర్ కు కనిపించింది. పులిని చూసి టర్నింగ్ వద్ద బైకును కంట్రోల్ చేయలేక పులిని ఢీకొట్టి కిందపడి పోయాడు. బైకు పులిని ఢీకొనడంతో ఉలిక్కి పడ్డ పులి అడిలోకి పారిపోయింది. బైకు నుండి కిందపడి గాయాల పాలైన తాహెర్ కొద్ది దూరం పరుగులు తీసి పులి నుండి ప్రాణాలతో బయట పడ్డాడు. అనంతరం వెనుక వైపు నుంచి బైకు పై వస్తున్న మరో యువకుడిని ఆపి అతడితో బైకుపై సమీప ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. తాహేర్ కు స్వల్ప గాయాలు కావటం, పులికి కూడా పెద్దగా గాయాలు కాకపోవడం, అందులోనూ అది తాహెర్ పై దాడి జరపకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులి సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు పులి సంచరించిన ప్రదేశాల్లో పులి పాదముద్రల సేకరణ చేపట్టి.. ట్రాకర్స్ తో గట్టి నిఘా పెట్టారు.
20 రోజుల క్రితమే పక్క రాష్ట్రానికి వెళ్లిన పులి..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను నాలుగు పులులు గత కొన్నిరోజులుగా వణికిస్తున్నాయి. అయితే 20 రోజుల క్రితమే ఓ పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లడం జిల్లా వాసులకు కాస్త ఊరటనిస్తోంది. ఇంకా జిల్లాలో జనావాసాల మధ్యకు మూడు పులులు వస్తున్నాయని రాత్రి వేళ బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం నాగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పులిదాడి నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు. మంగళవారం ఉదయం కూరగాయలు తీసుకొని మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో పెద్దపులి దాడి చేయడానికి ప్రయత్నించగా.. తాను తప్పించుకొని గ్రామంలోకి వెళ్లానన్నాడు. అటవిశాఖ అధికారులు సమాచారం తెలుసుకొని పులి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. పులి ప్రాణహితనది దాటిన అడుగులను చూసి ఎట్టకేలకు అది మహారాష్ట్రకు వెళ్లిపోయిందని నిర్ధారించారు. దీంతో జిల్లా వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఓ పులి..
బెజ్జురు మండలం నాగపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పులిదాడి నుంచి తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు. మంగళవారం ఉదయం కూరగాయలు తీసుకొని మహారాష్ట్రకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలో పెద్దపులి దాడి చేయడానికి ప్రయత్నించిందన్నాడు. తాను తప్పించుకొని గ్రామంలోకి వెళ్లానన్నాడు. అటవీశాఖ అధికారులు పులి వెళ్ళిన ప్రాంతాన్ని ఉదయం పరిశీలించారు. బెజ్జూర్ మండలంలోని నాగేపల్లి, కోయపల్లి గ్రామాల మధ్య మహారాష్ట్రకు వెళుతున్న వ్యక్తులకి పులి కనపడటంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవి అధికారులు.. ఆ పులి ప్రాణహిత నది దాటి వెళ్లినట్లు దాని అడుగుల ఆధారంగా ధ్రువీకరించారు. గ్రామస్తులు ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదని, మళ్లీ ఎక్కడైనా పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు.