Karimnagar Wife Murdred Hunsband: ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ రాధిక అంటాడు.. టిల్లు. హత్య కేసులో ఇరుక్కున్న కేసులో ఈ డైలాగ్ వస్తుంది. ఇలాగే బిగినర్స్ మిస్టేక్స్ చేసి భర్త హత్యలో దొరికిపోయింది ఓ భార్య. కరీంనగర్ లో ఈ ఘటన జరిగింది.
కరీంనగర్‌లో ఓ భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని.. మళ్లీ తానే డెడ్ బాడీ దొరికిందని సమాచారం ఇచ్చింది. ఇదేదో తేడాగా ఉందని పోలీసులు ఆమె కాల్ డేటా, ఫోన్ లొకేషన్ బయటకు తీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె లవర్ తో కలిసి భర్తను హత్య చేసి.. తప్పించుకోవడానికి ప్లాన్ చేసి..దొరికిపోయినట్లుగా గుర్తించారు.
కరీంనగర్లో ఉండే రమాదేవి భర్త .. గ్రంథాలయంలో స్వీపర్ గా పని చేస్తూంటాడు. రమాదేవి సర్వపిండి అమ్ముతూ ఉంటుంది. రమాదేవి సర్వపిండికి ఫిరా అయిన కర్రె రాజయ్య అనే వ్యక్తి రోజూ బండి దగ్గరకు వచ్చేవాడు. సర్వపిండి కొనడంతోపాటు రమాదేవితో కూడా మాటలు కలిపాడు. మెల్లగా వివాహేదర బంధంలోకి లాగేశాడు. ఇద్ద రూ అడ్వాన్స్ అయిపోయారు. అయితే వీరి మధ్య ఏదో జరుగుతోందని భర్త సంపత్ కు డౌట్ వచ్చి నిలదీయడం ప్రారంభించాడు.
దీంతో రమాదేవి, రాజయ్య ఇద్దరూ కలిసి సంపత్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే చాలా మర్డర్ కేసుల్లో ఇలా భర్తను చంపేసి దొరికిపోతున్నారమని..మనం అలా దొరక్కూడదని అనుకున్నారు. రమాదేవి యూట్యూబ్ లో వెదికింది. విషం కలిపి చంపడం సహా చాలా కాంబినేషన్లు వెదికింది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసిన చోట దొరికిపోయారు. అందుకే కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. విషం పెట్టకూడదు.. కత్తులతో పొడవకూడదు.. గొంతు పిసకకూడదు..ఇలా అన్ని ఆప్షన్స్ వద్దనుకున్నాక..ఎవరూ చేయని విధంగా చెవుల్లో గడ్డి మందు పోసి చంపవచ్చని గుర్తించారు. ఆ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
తర్వాత మంచి రోజు చూసుకుని సంపత్ ను పార్టీకి పిలిచి స్కెచ్ అమలు చేసిన ప్రియుడు రాజయ్య. మద్యం మత్తులో కిందపడిపోగానే చెవిలో గడ్డి మందు పోశాడు రాజయ్య- అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని సమాచారం ఇచ్చాడు రాజయ్య. భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య రమాదేవి పోలీసులు హడావుడిగా రాజయ్య డెడ్ బాడీ కోసం వెదుకుతారని అనుకుంది. కానీ పట్టించుకోకపోయే సరికి.. డెడ్ బాడీ దొరికిందని పోలీసులుక సమాచారం ఇచ్చారు. పోలీసులకు అంతా తేడాగా ఉండటంతో కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తామే హ*త్య చేసినట్టు రమాదేవి, రాజయ్య అంగీకరించారు. వీరికి సహకరించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.