Woman Suicide: ఆమెకు అప్పటికే పెళ్లయింది. కానీ భర్త దూరంగా ఉండటంతో వేరే వ్యక్తికి దగ్గరయింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. పెళ్లయ్యే వరకు మనకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. పెళ్లి చేసుకొమ్మని అడిగిన ప్రతీ సారి.. కొన్నాళ్లు ఆగమంటూ చెప్పేవాడు. ఇలా గత ఎనిమిదేళ్లుగా జరగుతూనే ఉంది. దాదాపు 14 సార్లు అతడు ఆమెకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించాడు. ఇదంతా భరించలేని పెళ్లి చేస్కొమ్మన బతిమాలింది. అతను ఎంతకూ ఒప్పుకోకపోవడంతో.. భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది.
అయితే భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళతో బిహార్ కు చెందిన గౌతమ్ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఒకరినొకరు ఇష్టపడి శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత సహజీనం చేయడం ప్రారంభించారు. కొన్నాళ్లు కలిసి ఉన్నాక పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే వారు తరచుగా శారీరకంగా కలవడం ప్రారంభించారు. దాదాపు 8 ఏళ్లగా వీరు కలిసే ఉంటున్నారు. అయితే ఆమె గర్భం దాల్చిన ప్రతీ సారి పెళ్లయ్యాకే పిల్లలు అంటూ అబార్షన్ చేయించాడు. చివరకు నాకు నీవూ వద్దు.. నీతో పెళ్లి వద్దని వెళ్లిపోమన్నాడు.
భరించలేక మహిళ బలవన్మరణం..
భర్తను కాదనుకొని వచ్చిన తనను ప్రియుడు కూడా కాదు పొమ్మన్నాడు. ఎనిమిదేళ్ల పాటు ప్రేమగా వ్యవహరించి శారీరకంగా వాడుకున్నాడు. కల్లబొల్లి మాటలు చెప్తూ వద్దని వారిస్తున్నా వినకుండా 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇదంతా ఒక్కసారిగా ఆమె మనసులో మెదిలింది. తప్పు చేశానోమోనన్న బాధ మనసును మెలి పెట్టింది. ఇక బతికి సాధించేది ఏం లేదనుకున్న ఆమె.. చనిపోవాలని నిర్ణయించుకుంది. జులై 5వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ఆమె మృతదేహాన్ని కిందకు దింపారు.
అయితే ఆమె దుస్తుల్లో పోలీలుసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె "అతడు చేసిన తప్పులకు సంబంధించి ఆధారాలు సేకరించా. నా ఫోన్ ను చెక్ చేయండి" అని రాసి ఉంది. ఫోన్ చేయగా... గౌతమ్ చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని స్థానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని... ఆమె ఆత్మహత్యకు కారణం అయిన గౌతమ్ ను వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం తప్పని.. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఆలోచించి నిర్ణయాలు తీస్కోవాలని పోలీసులు తెలిపారు. అరనిమిషం పాటు వచ్చే ఆవేశం వల్ల అంతులేని దుఃఖమే మిగులుతుంది తప్ప ఆనందం ఉండదని అన్నారు. ఈ మధ్య చాలా మంది వివాహేతర సంబంధాలతో ప్రాణాలు తీస్కోవడం, తీయడం చేస్తున్నారని చెప్పారు.