Wife Pours Boiling Oil Red Chilli Powder On Husband While He Was Asleep: భార్యలు కర్కశంగా ఉంటారు. ఎంత అంటే.. వారి భర్తలకు నరకం అంటే ఏమిటో భూమిపైనే చూపిస్తారు.  దక్షిణ దిల్లీలోని మదంగిర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనే దానికి నిదర్శనం.  28 ఏళ్ల ఫార్మా కంపెనీ ఉద్యోగి దినేష్ కుమార్‌పై అతని స్వస్థ భార్య సాధన (25)  వేడి నూనె, ఎర్ర మిర్చపొడి పోసి దారుణంగా హింసించింది ఇప్పుడు  ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న దినేష్ చావు బతుకుల మధ్య ఉన్నాడు.  

దినేష్ ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత  భోజనం చేసి పడుకున్నాడు. తనపై వేడి నూనె పడటంతో ఒక్క సారిగా తెల్లవారుజామున మెలకువ వచ్చింది.  తన మీద ఉడికించిన నూనె పోస్తున్న తన భార్యను చూశాడు.  3.15 గంటల సమయంలో శరీరం అంతటా తీవ్రమైన కాలి బాధ కలిగింది. నేను మేల్కొని చూసేసరికి, నా భార్య నిలబడి నా ముఖం, మెడపై గరిష్టంగా ఉడికించిన నూనె పోస్తోంది. సహాయం కోరడానికి లేచే ముందే, ఆమె ఆ కాలిన చోట్ల ఎర్ర మిర్చపొడి చల్లింది అని తన వాంగ్మూలంలో పోలీసులకు దినేష్ వివరించాడు.

బాధతో కేకలు వేస్తూ ప్రతిఘటించిన దినేష్‌ కు మరింత నూనె పోస్తానని హెచ్చరించిది. బాధతో అరుస్తున్న అరుపులు విని  ఇంటి యజమానితో సహా ఇతరులు  తలుపు తెరవమని కొట్టినా సాధన తలుపు తెరవలేదు. చివరికి ల్యాండ్‌లార్డ్ ఆమె సోదరుడిని ఫోన్ చేసి పిలిపించాడు. అప్పుడు తలుపు తెరిచిన సాధన, తన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి  వేరే చోటకు వెళ్లిపోయింది. దీంతో  ఇంటి యజమానే ఆస్పత్రికి తరలించాడు.  

8 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ దంపతుల మధ్య  గత కొన్ని రోజులుగా కలహాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం సాధన  గృహ హింస  ఫిర్యాదు చేసింది. అయితే, రెండు వర్గాల మధ్య సమాధానం ద్వారా ఆ మేరకు కేసు ముగిసింది. ఈ సారి ఘటనకు కారణం ఏమిటో తెలియలేదు.  ఘటన జరిగిన రోజు వారింట్లో పెద్ద గొడవ జరిగినట్లుగా   పొరుగువారు  వారు పోీలసులుక చెప్పారు.   

సాధారణంగా పురుషులపై హింస గురించి తక్కువగా మాట్లాడుకునే దేశంలో, ఇలాంటి ఘటనలు మనసులో భయాన్ని కలిగిస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.