Agnipath Protest Who Is Protesters :  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎప్పుడూ చూడనంత విధ్వంసం జరిగింది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రోజూ వేలాది మందిరాకపోకలు సాగిస్తున్న చిన్న చిన్న నేరాలు మాత్రమే వెలుగుచూసేవి. భద్రత పటిష్టంగా ఉంటుంది. అణువు అణువు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అనుమానాస్పదంగా ఎలాంటి వ్యక్తులు కనిపించినా తక్షణం అదుపులోకి తీసుకునే వ్యవస్థ ఉంది. అందుకే చాలా కాలం అక్కడ ఎలాంటి నేరాలు జరగడం లేదు. కానీ హఠాత్తుగా రైల్వే స్టేషన్ మొత్తం రణ రంగమైపోయింది. రైళ్లు తగలబెట్టేశారు. ఫ్లాట్ ఫామ్‌పై స్టాళ్లనూ వదిలి పెట్టలేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వేల మంది చొరబడ్డారు. చేయాల్సినంత విధ్వంసం సృష్టింారు. 


ఒక్క సారిగా రైల్వే స్టేషన్‌లోకి అంత మంది ఎలా వచ్చారు ?


అసలు ఒక్క సారిగా అంత మంది ఎలా వచ్చారనేది రైల్వే పోలీసులకే రాష్ట్ర తెలంగాణ ఇంటలిజెన్స్ వర్గాలకూ అంతుబట్టడం లేదు. ఏదైనా రాజకీయ పార్టీ పిలుపునిచ్చినా అంత పెద్ద సంఖ్యలో రావడం అసహజం.  నిజానికి ఉదయమే రైల్వే స్టేషన్ బయట బస్సులపై దాడి చేయడంతో అందరూ ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు అనుకున్నారు. అందరూ బస్సుల విధ్వంసం వైపు చూస్తూండగానే లోపల రైల్వే స్టేషన్ లో మంటలు ప్రారంభమయ్యాయి. రైళ్లను తగులబెట్టడం ప్రారంభించారు. అంటే  బయట ఉన్నది కొద్ది మందే.. అసలు విధ్వంసకులు అప్పటికే లోపలకి దూసుకెళ్లిపోయారు.


అంతా ఆర్మీలో చేరాలనుకునేవారేనా ?


మొత్తంగా నాలుగైదు వేల మంది వరకూ ఆందోళనకారులు ఉండవచ్చని భావిస్తున్నారు. అసలు వారెంత ఎలా వచ్చారన్నది ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఎక్కువ మంది ఆర్మీ లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారేనని ..  వారి  మాటల ద్వారా... బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసుకోచ్చు. దాన్ని బట్టి అగ్నిపథ్ స్కీమ్ అసంతృరప్తి సెగలని అర్థమైంది. తర్వాత పోలీసులు ... రైల్వే పోలీసులు.. వారితో చర్చలు జరిపిన తర్వాత క్లారిటీ వచ్చింది.  వారంతా ఆర్మీ ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్నవారే.  పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చుస్తున్నవారే. వారందరికీ రెండేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు అదే సమయంలో కేంద్రం అగ్నిపథ్‌ను తీసుకొచ్చింది. దీంతో తమ జీవితాలు బుగ్గి అయిపోయాయన్న ఆవేశంతో ఒక్క సారిగా దూసుకొచ్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


యువతలో పెరిగిపోతున్న అసంతృప్తి, అసహనానికి నిదర్శనమా ?


నిజానికి ఏ రాజకీయ పార్టీ లేదా.. మరో సంఘం... అయినా ఆర్గనైజ్డ్‌గా నిర్వహిస్తే పోలీసులకు తెలిసిపోతుంది. కానీ  ఇక్కడ పోలీసులకు కనీ సమాచారం కూడా లేనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే విధ్వంసం జరిగిన తర్వాతనే పోలీసులకూ ఈ విషాయన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటిదాకా చిన్న విషయమనే అనుకున్నారు. కానీ ఇది నిరుద్యోగుల్లో ప్రబలిపోతున్న అసంతృప్తికి కారణం అని..  ఎవరూ వారిని రెచ్చగొట్టడం లేదా ఆర్గనైజ్ చేయడం కానీ జరగలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.