West Bengal Crime News: ఆరేళ్ల క్రితం వారిద్దరికీ పెళ్లి జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ గత కొంత కాలంగా భర్తకు.. భార్యపై అనుమానం మొదలైంది. ఆమె మరెవరితోనే వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై తీవ్ర కోపోద్రిక్తుడై చంపాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఆపై మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి అంటే తల, మొండం వేరు చేసి కాలువలో పడేశాడు. అయితే కాలువలో శరీర భాగాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురికి చెందిన మహమ్మద్ అన్సరుల్, రేణుకా ఖాతూన్ భార్యా భర్తలు. వీరిద్దరికి ఆరేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లైన తర్వాత వీరి మధ్య చాలానే విబేధాలు వచ్చాయి. కానీ కుటుంబ సభ్యుల సహకారంతో వాటిని పరిష్కరించుకున్నారు. ఆపై కొంత కాలం వీరిద్దరూ బాగానే కలిసి ఉన్నారు. కానీ మహమ్మద్ అన్సురల్ కు.. భార్య రేణుకా ఖాతూన్ పై అనుమానం మొదలైంది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని భావించాడు. అలా ఆమెపై విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఆమెను చంపి కోపాన్ని తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను హత్య చేసేందుకు ఓ పథకం వేశాడు.
రేణుకా ఖాతూన్ సిలిగురిలో బ్యుటీషియన్ కోర్సు నేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే రోజూ తరగతులకు వెళ్లి వస్తోంది. అయితే డిసెంబర్ 23వ తేదీ నాడు రేణుక బ్యుటీషియన్ క్లాసుకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత మహమ్మద్ అన్సురల్ ఆమెను బయటకు వెళ్దాం పదా అని చెప్పి సమీంలోని ఫన్సిదేవాకు తీసుకెళ్లాడు. అక్కడే నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆపై తల, మొండాన్ని వేరు చేశాడు. రెండింటినీ వేరు వేరు సంచుల్లో వేసి సమీపంలో ఉన్న ఓ కాలువలో పడేశాడు. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 24వ తేదీ నుంచి భార్య కనిపించడం లేదంటూ లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజే కొందరు వ్యక్తులు ఓ కాలువలో మృతదేహం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు.
ఆ మృతదేహం రేణుకా ఖాతూన్ ది అయ్యుండవచ్చని భావించిన పోలీసులు మహమ్మద్ అన్సురల్ ని పిలిపించారు. ఈ క్రమంలోనే అతడు భయపడుతున్న ప్రవర్తించడంతో పోలీసులు గట్టిగా విచారించారు. ఈ క్రంమలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్య రేణుకా ఖాతూన్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆపై భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి కాలవలో పడేశానని చెప్పాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మృతదేహా భాగాలను కాలువలోంచి తీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. డైవర్ల సాయంతో వెతికిస్తున్నారు.
అయితే రేణుక చనిపోయినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాభర్తలకు మధ్య గొడవలు ఉన్న విషయం మతకు తెలుసని.. కానీ అవి పరిష్కరించుకున్నారని అనున్నామని చెప్పారు. కానీ మహమ్మద్ అన్సురల్ ఇంత పని చేస్తాడని ఊహించలేదని వాపోయారు.