Warangal Murder Case:  వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప అనే వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. హంతకుడు సొంత మేనల్లుడేనని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.  మద్యానికి, జల్సాలకు అలవాటు పడిన యువకుడు డబ్బు కోసం ఏకంగా మేనత్తను హతమార్చి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన హత్యను చేదించి నిందితుడు రేకులపెల్లి ప్రణయ్ అరెస్ట్ చేసి చోరీ కి గురైన 18 లక్షల విలువ చేసే 170 గ్రాముల బంగారు, 34 గ్రాముల వెండి అభరణాలతో పాటు పదివేల నగదు, ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ కమిషనరేట్ ఈస్ట్‌జోన్‌ డీసిపి అంకిత్‌ కుమార్‌ తెలిపారు.

జూన్ ఏడో తేదీన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప వయస్సు 70 సంవత్సరాల వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఈస్ట్‌జోన్‌ డిసిపి తెలిపారు. గీసుగొండ పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోని వృద్దురాలని దారుణంగా హత్య చేసింది మృతురాలి మేనల్లుడుగా గుర్తించారన్నారు. వరంగల్‌ నగరం మట్టెవాడ రాజీవ్‌ కాలనీకి చెందిన రేకులపెల్లి ప్రణయ్ గా దర్యాప్తులో నిర్థారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. 

                                

హత్యపై  నిందితుడిని విచారించగా అప్పుల కారణంగా ఈ  హత్య చేసినట్లుగా వివరించాడు.  ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో మద్యానికి జల్సాలు బానిసయ్యాడని డీసీపీ చెప్పాడు.  జల్సాలకు ద్విచక్ర వాహనం కోనుగొలు చేసేందుకు ఇతరల వద్డ నిందితుడు అప్పులు చేసి తిరిగి చెల్లించే క్రమంలో ఒత్తిడి పెరగడంతో సులభంగా డబ్బు సంపాదించాలని చోరీలను ఎంచుకున్నట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో గీసుగొండ, మట్టెవాడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో   నాలుగు చోరీలకు పాల్పడ్డాడని, అయిన నిందితుడి అప్పులు తీరకపోవడంతో పాటు జల్సాలకు డబ్బు కావాల్సిఉండడంతో ఒంటరిగా నివాసం ఉంటున్న తన మేనత్త పై దృష్టి పెట్టారు.            

ఆమె వద్ద పెద్దఎత్తున బంగారం, డబ్బు ఉండడంతో ఈ నెల 7వ తేదీన మేనత్త ఇంటికి వెళ్ళిన నిందితుడు ప్రణయ్  మద్యం సేవించి మృతురాలి ఇంట్లోనే నిద్రించాడు. మృతురాలైన మేనత్త నిద్రలోకి కరుకున్న తరువాత వ్యాయామం చేసే డంబెల్‌తో మేనత్త స్వరూప ను వ్యాయామ దంబెల్ తో హత్య చేసి. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు అభరణాలతో పాటు వెండి వస్తువులు, కొంత డబ్బును దోచుకొని వెళ్లినట్లు డీసీసీ చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.