Warangal Crime : మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను సీసీఎస్, మట్వాడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ ఆలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె రామక్క నూనె ఎల్లయ్య అలియాస్ గజ్జి ఎల్లయ్య ఉన్నారు. నిందితుల నుంచి సుమారు రెండు లక్షల రూపాయల విలువగల జనరేటర్ రేడియేటర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అసలేం జరిగింది?
ఈ కేసుకు సంబంధించి వరంగల్ ఏసీపీ గిరికుమార్ వివరాలను వెల్లడిస్తూ... పోలీసులు అరెస్ట్ చేసిన నిందితురాళ్లు ముగ్గురు దగ్గరి బంధువులని తెలిపారు. వీళ్లంతా చిత్తు కాగితాలు, పాత ఇనుప సామాను సేకరిస్తూ జీవించేవారు. కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురు మట్వాడాలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ప్రముఖ కంపెనీ చెందిన వర్క్ షాపు కంపౌడ్లో ఉన్న జనరేటర్ రేడియటర్ ను చోరీ చేసి దానిని అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇదే తడువుగా ఈ ముగ్గురు తమ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ఆటో డ్రైవర్ సహకారంతో ఈనెల 13న ఖరీదైన జనరేటర్ రేడియోటర్ ను చోరీ చేశారు. చోరీ చేసిన రేడియోటర్ ను కొద్ది రోజుల తరువాత అమ్మి సొమ్ము చేసుకుందామని ఈ నలుగురు నిందితులు వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వెనుక చెట్ట పొదల్లో రేడియోటర్ ను రహస్యంగా భద్రపర్చారు. ఈ చోరీపై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులను గుర్తించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం ఈ నలుగురు నిందితులు రేడియోటర్ ను అమ్మేందుకు ఆటోనగర్ కు వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో ఆటోనగర్ లో కాపుగాచిన పోలీసులు నిందితులు పట్టుకోని విచారించగా చోరీని అంగీకరించారు. ఆలేటి మైసమ్మ, దివ్యలు గతంలో ఆత్మకూర్, మట్వాడా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కారు.
మావోయిస్టు కొరియర్ అరెస్ట్
వరంగల్ జిల్లా కాటారం మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతూ సహకరిస్తున్న పోలం రాజయ్య కొరియర్ ను అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్ పంపించినట్లు కాటారం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాటారం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మావోయిస్టు కొరియర్ పోలం రాజయ్య అరెస్టును వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుప్పారం క్రాస్ రోడ్ వద్ద కాటారం ఎస్సై సుధాకర్ వాహనాల తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి బెదిరి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సిఆర్పిఎఫ్ పోలీసుల సహాయంతో ఛేజ్ చేసి చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు. అతనిని విచారించగా మావోయిస్టు పార్టీ అగ్రీ నేత కంకణాల రాజిరెడ్డికి సహకరిస్తున్నట్లు విచారణలో వెళ్లడైందన్నారు. అతని వద్ద నుండి జిల్టెన్ స్టిక్స్ డిటర్నేటర్లు గ్రేనేడ్లు క్రాంతి పత్రిక విప్లవ సాహిత్యం స్వాధీనం వినిపించినట్లు డిఎస్పి వెల్లడించారు.
నిందితుడిపై 18 కేసులు
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామానికి చెందిన పోలం రాజయ్య 1995 మావోయిస్టు పార్టీలో చేరి మావోయిస్టుల అగ్రనేతనకు అప్పుడు ప్రొటెక్షన్ ఫోర్సులో పనిచేశాడని ఆ తర్వాత 2002లో ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత కేకే డబ్ల్యూ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశం తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను విస్తృతం చేసే పనిలో భాగంగా మాజీ మిలిటెంట్లను సానుభూతిపరులను రిక్రూట్మెంట్ చేసే పనిలో భాగంగా పొలం రాజయ్యను మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేస్తున్నాడని, ఇతను విద్యార్థులు ప్రజలను లో సిద్ధాంతాలను బోధిస్తూ మావోయిస్టు పార్టీలో చేర్పించడానికి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని డిఎస్పి వెల్లడించారు. అరెస్టు అయిన నిందితుడు పోలం రాజయ్య పై వివిధ ప్రాంతాల్లో 18 కేసులు ఉన్నట్లు డిఎస్పి తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై యువకులు, విద్యార్థులు పట్టవద్దని, తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డిఎస్పి రామ్మోహన్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి రామ్మోహన్ రెడ్డితో పాటు కాటారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ రావు కాటారం,కొయ్యూరు,ఎస్సైలు శ్రీనివాస్, సుధాకర్, కిషోర్ సిఆర్ పి ఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.