పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తోటి ఉపాధ్యాయురాలి బాధలను అలుసుగా తీసుకొని ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె వీడియోలు సేకరించి వాటి ఎరగా.. తీవ్రమైన వేదనకు గురి చేశాడు. తన శారీరక కోరికలను తీర్చాలంటూ వెంటపడ్డాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు కటకటాలపాలయ్యాడు. విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా రావికమతం గవర్నమెంట్ స్కూలులో సూరెడ్డి మహేశ్వరరావు అనే వ్యక్తి సోషల్ స్టడీస్ టీచర్‌గా పని చేస్తున్నాడు. పోయిన సంవత్సరం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ఉపాధ్యాయుల ట్రైనింగ్ తరగతులకు హాజరయ్యాడు. ఇక్కడికి జంగారెడ్డి గూడెం నుంచి ఓ ఉపాధ్యాయురాలు కూడా ట్రైనింగ్‌కి వచ్చింది. ఆమెకు 2019లో పెళ్లి అయింది. భర్త శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉంది. ఇబ్రహీంపట్నం టీచర్స్ ట్రైనింగ్‌లో ఆమెకు ఈ సోషల్ టీచర్ మహేశ్వరరావు పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో ఆమె తన బాధను చెప్పుకుంది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.


Also Read: Rape on Old Woman: 99 ఏళ్ల వృద్ధురాలిపై కేర్ టేకర్ రేప్.. సీసీటీవీలో రికార్డు, ఫుటేజీ చూసి భయపడిపోయిన ఫ్యామిలీ 


అలా అప్పుడప్పుడూ ఫోన్లలో కూడా మాట్లాడుకునే వారు. అలా గత ఏడాది సెప్టెంబరు 27న వీరిద్దరూ విజయవాడ ప్రధాన బస్టాండ్‌ సమీపంలో ఓ లాడ్జిలో దిగి.. ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారు. అదే సమయంలో ఆమె నిద్ర పోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె అశ్లీల ఫొటోలను మహేశ్వరరావు తీసి, అప్పటి నుంచి బెదిరించటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా లాడ్జిలో ఉండగానే, ఉపాధ్యాయురాలి స్మార్ట్ ఫోన్‌లో ఆమెకు తెలియకుండా రహస్యంగా ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాని ద్వారా ఆమె ఫోన్‌లో జరుగుతున్న అన్ని వివరాలను అతను తెలుసుకునేవాడు. 


కొద్ది రోజులకు అశ్లీల ఫోటోలు, వీడియోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. అలా ఆమెను వేర్వేరు నగరాల్లో హోటళ్లలో గదులు అద్దెకు తీసుకొని శారీరక వాంఛ తీర్చుకునేవాడు. అతడి వేధింపులు మరింత ఎక్కువ కావటంతో బాధితురాలు ఈనెల 4వ తేదీన విజయవాడలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు 376, 354డీ, 506 ఐపీసీ, 66, 67 ఐటీఏ 2000-2008 సెక్షన్ల కింద కేసు పెట్టారు. విచారణ అనంతరం మహేశ్వరరావును మహిళా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.


Also Read: Anantapur: వీరి వద్ద దొంగల తయారీ జరుగును, ఇంటికి తాళం వేసి ఉంటే ఇక అంతే.. కీలక వివరాలు చెప్పిన ఎస్పీ