Vizag Bike Racing : విశాఖలో శనివారం రాత్రి  బైక్ రైడర్స్ బీభత్సం సృష్టించారు. రాత్రి 11.45 గంటల నుంచి ఉదయం 3 గంటల బైక్ రైడర్స్ ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, బీచ్ రోడ్, చినవాల్తేరులో  ట్రిపుల్ రైడింగ్ తో  హల్ చల్ చేశారు. ఆర్టీసీ బస్సు వెళ్లడానికి సైడ్ అడిగిన పాపానికి డ్రైవర్ పై దాడి చేశాడో బైక్ రైడర్. బస్సు హారన్ కొట్టాడని డ్రైవర్ పై బైక్ రైడర్ దాడి చేశాడు.  ఈ విషయాన్ని బస్సు డ్రైవర్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లాడు డ్రైవర్. పోలీసులు బైక్ రేసింగ్ పై ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదని స్థానికులు అంటున్నారు. బీచ్ లో బైక్ రేసింగ్ పై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 


ఐదు కేసులు, 8 మంది అరెస్టు 


శనివారం రాత్రి బైక్ రేసింగ్ పై విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐదు కేసులు నమోదు అయ్యారు. రేష్, నెగ్లెజెన్స్ యాక్ట్ ప్రకారం నాలుగు కేసులు, గవర్నమెంట్ ఎంప్లొయ్ పై  దాడి చేసినందుకు ఒక కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 35 మందిని గుర్తించారు. బైక్ రేసింగ్ పాల్గొన్న వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు బైక్ లను సీజ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రేసింగ్ పాల్గొన్న యువకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విద్యార్థులు, యువకులకు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పాలని లేకపోతే వారి భవిష్యత్ నాశనం అవుతోందని పోలీసులు హెచ్చరించారు. బైక్ రేసింగ్ లు వారి ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తాయని ఇటువంటి చర్యలకు యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.