Visakha Crime : విశాఖపట్నం మధురవాడలో దారుణం జరిగింది.  ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో మహిళ. ఈస్ట్ ఆఫ్రికా లో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు బుడుమురి మురళీ. ఇటీవల ఆయన విశాఖ వచ్చారు. తన భర్త కనిపించడంలేదని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లో మురళీ భార్య మృదుల ఫిర్యాదు చేసింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మిస్సింగ్ మిస్టరీ గుట్టు విప్పారు పీఎంపాలెం పోలీసులు. ఈ కేసు విచారణలో మురళీ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. 10 రోజుల క్రితమే మురళీని హత్య చేసి మృతదేహాన్ని మారికవలస బ్రిడ్జి కింద పడేశారు.  మురళీ మృతదేహానికి పోస్టుమార్టానికి తరలించారు.  


అసలేం జరిగింది? 


ప్రియుడితో మోజులో ఓ మహిళ తన భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది.  ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి మారికవలస బ్రిడ్జి కింద పడేసింది. ఆ తర్వాత తన భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.  మధురవాడ రిక్షా కాలనీకి చెందిన బడుమూరు మురళి ఈస్ట్ ఆఫ్రికాలో 8 ఏళ్లుగా ప్రొఫెసర్ ​గా పనిచేస్తున్నారు.  ఇటీవల అతడు ఇంటికి తిరిగొచ్చాడు. భర్త విదేశాల్లో ఉన్నప్పుడు మురళీ భార్య మృదుల ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని ఫ్లాన్ పథకం ప్రియుడితో కలిసి ఇంట్లోనే హత్య చేసింది. మృతదేహాన్ని మారికవలస బ్రిడ్జి కింద పడేశారు. తర్వాత తన భర్త కనిపించడంలేదని మిస్సింగ్ కేసు పెట్టింది.  ఆమెపై అనుమానంతో పోలీసులు విచారించడంగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.


ప్రేమ పేరుతో ఎస్ఐ మోసం


కృష్ణాజిల్లా పెనమలూరుకి చెందిన ఓ మహిళను ప్రేమ పేరుతో ఎస్సై మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి కలిసి తిరిగి చివరకు మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు చేసిన 12 గంట‌ల్లోనే పోలీసులు కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన అటు పోలీసు వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఎస్ ఐ చేసిన మోసంపై బాధితురాలు మచిలీపట్నం దిశ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దిశ పోలీసులు కేసు న‌మోదు చేసుకొని రికార్డు స‌మ‌యంలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.


పెనమలూరుకు చెందిన 27 ఏళ్ల మహిళ, ఎస్‌ఐ విశ్వ‌నాథప‌ల్లి గణేష్ క్లాస్‌మేట్స్. బీటెక్‌ నుంచే పరిచయం ఉంది. మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా మళ్లీ కలిశారు. నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ఇద్దరి పర్సనల్‌ విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆమె ఫ్యామిలీలో ఉన్న గొడవలు గురించి అప్పుడే తెలుసుకున్నాడు ఎస్సై గణేష్. ఆమె భర్తతో ఉన్న విభేదాలు కారణంగా ఆమెకు దగ్గరయ్యాడు. భర్తతో గొడవలు ఉన్నందున రెండో పెళ్లి చేసుకోవడం కుదరని ఆమెతో చెప్పాడు ఎస్సై. భర్త నుంచి విడాకులు తీసుకుంటే మరో పెళ్లికి వీలు అవుతుందని సలహా ఇచ్చాడు. తానే చేసుకుంటానంటూ కలరింగ్ న‌మ్మించాడు. ఎస్సై మాటలకు పూర్తిగా పడిపోయిందామె. ఎస్సై తనకు కొత్త లైఫ్ ఇస్తారనుకొని కలలుకన్నది


ఎస్సై మాటలు నమ్మిన ఆ బాధితురాలు భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. తనతో అప్పటి వరకు క్లోజ్‌గా ఉన్న ఎస్సై దూరం జరిగాడు. కొద్ది రోజుల తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. పెళ్ళి విష‌యం అడిగిన‌ప్పుడ‌ల్లా గణేష్ ఆమెను దూరం పెట్టేందుకు ప్ర‌య‌త్నించాడు. ఎన్నిసార్లు అడిగినా పెళ్ళి చేసుకునేందుకు గణేష్ ముందుకు రాలేదు. అప్పటికి గాని బాధితురాలికి అసలు విషయం తెలియరాలేదు. పెళ్లి సంగతిని దాట వేసి తనతో ఆడుకుంటున్నాడని అర్థమైన బాధితురాలు... గణేష్‌ను నిలదీసింది. పెళ్లి చేసుకుంటావా పరువు తీయమంటావా అని గట్టిగాని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఎస్సై గణేష్‌ తాను పోలీసునని.. డిపార్టమెంట్‌ మొత్తం తనకు అండగా ఉంటుందన్నాడు. ఆమెను బెదిరింపుల‌కు గురి చేశాడు. దీంతో బాధితురాలు ఈ విష‌యాన్ని ఉన్న‌తాదికారుల దృష్టికి తీసుకువెళ్లింది. వాళ్ల సూచనతో దిశ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎస్‌సి , ఎస్‌టి యాక్ట్ కింద కేస్ నమోదు చేశారు. 12గంటల్లో నిందితుడైన ఎస్ఐ గ‌ణేష్ ను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో  7 రోజుల‌్లో దర్యాప్తు ముగించి.. చట్టపరంగా బాధితురాలికి రావాల్సిన పరిహారం ఇప్పిస్తామ‌ని తెలిపారు.