Biryani Point Issue: వ్యాపారంలో వచ్చిన వివాదంతో ప్రత్యర్థి హత్య చేసేందుకు పథకం వేసి చివరి నిమిషంలో విచిత్రంగా దొరికిపోయాడో యువకుడు. ప్రత్యర్థిని హతమార్చేందుకు బిహార్‌ వెళ్లి తుపాకీ కొనుక్కొచ్చిన యువకుడు.. చివరి నిమిషయంలో అది పేలకపోవడంతో హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నాడు.  ఏపీలోని విశాఖలో ఇటీవల ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకా బస్‌స్టాండ్‌ సమీపంలో మద్ది రాజశేఖర్‌రెడ్డి బిర్యానీ పాయింట్‌ నడుపుకుంటున్నాడు. ఆ సమీపంలోనే చిల్లినాయుడు కోడి పలావ్‌, ఫుడ్‌ ఈ-మామా పేరుతో రెండు బిర్యానీ పాయింట్లను రాజశేఖర్‌రెడ్డి బంధువు నరేంద్ర, అతని స్నేహితుడు సాయినారాయణ కలిగి ఏడాది క్రితం ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్న కొన్నాళ్లకు.. నరేంద్ర, సాయినారాయణ మధ్య వ్యాపార విభేదాలు తలెత్తాయి. వీళ్ల పంచాయితీ పెద్దల వరకు వెళ్లడంతో.. నరేంద్ర.. సాయినారాయణకు రూ.10 లక్షలు చెల్లించి బిర్యానీ పాయింట్‌ సొంతం చేసుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి మధ్యవర్తిత్వం వల్లే తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని సాయినారాయణ అతడిపై కక్ష పెంచుకున్నాడు.  Also Read: లవర్‌తో ఓయోకు వెళ్లిన యువతి.. గాయాలతో తెల్లారేసరికల్లా మృతి- మాదాపూర్‌లో విషాదం

Continues below advertisement

బెడిసికొట్టిన ప్లాన్

దీంతో రాజశేఖర్‌రెడ్డిని హత్య చేసేందుకు సాయినారాయణ ప్లాన్ వేశాడు. అతడు బిర్యానీ పాయింట్‌ను రాత్రి ఎన్ని గంటలకు మూస్తాడు, ఏ రోడ్డులో ఇంటికి వెళ్లాడో కొన్నిరోజులుగా రెక్కీ నిర్వహించాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో.. ఇటీవల బిహార్‌ వెళ్లి రూ.3 లక్షలు పెట్టి ఓ తుపాకీ కొనుకొచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఈ నెల 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో సాయినారాయణ నెల్లమ్మ వేపచెట్టు కింద ఉన్న రాజశేఖర్‌రెడ్డి దగ్గరకు వచ్చి తుపాకీతో హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సాయి నారాయణ తుపాకీ పేల్చగా, శబ్దం వచ్చినా బుల్లెట్‌ రాలేదు. దీంతో రాజశేఖర్‌రెడ్డి పెద్దగా అరవడంతో నిందితుడు సాయి అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం

తుపాకీ, బుల్లెట్లు సీజ్

తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రాజశేఖర్‌రెడ్డి.. సాయినారాయణ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈ నెల 21న పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయినారాయణను అరెస్టు చేసి, అతని నుంచి తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ కోర్టులో హజరుపర్చగా, కోర్టు రిమాండ్‌ విధించింది.  Also Read: అక్షితారాణి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పురుగుల మందు తాగించి హత్య.. అసలు నిందితుడు ఆ లెక్చరరే!

Continues below advertisement