Visakha Crime : విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పార్టీకి చెందిన కార్యకర్త తోట నరేంద్ర బాలికపై అత్యాచారం చేశాడు. బాలికను ప్రేమ పేరిట వేధించాడు. తన బర్త్ డే కు రాత్రి 12 గంటలకు వచ్చి విషెస్ చెప్పాలని బెదించాడు తోట నరేంద్ర. ఆ బెదిరింపులకు భయపడి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి విషెస్ చెప్పింది. ఆ సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు నరేంద్ర. ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో తోట నరేంద్రను బాలిక తల్లితండ్రులు నిలదీశారు. అనంతరం పీఎం పాలెం పోలీసులకు ఈ ఘటనపై బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తోట నరేంద్రను అరెస్టు చేశారు. నిందితుడిప సెక్షన్ 329/22 376, సెక్షన్ 3 పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. శనివారం మెజిస్ట్రేట్ ముందు నిందితుడు నరేంద్రను హాజరపరిచారు పీఎం పాలెం పోలీసులు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నరేంద్రను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.
హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్!
కాస్త నిర్మానుష్యంగా ఉండి ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మానవ రూపంలోని రాబందులు దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. హైదరాబాద్ శివారులో మరో సామూహిక అత్యాచర ఘటన వెలుగు చూసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధి గండిమైసమ్మ లో అర్ధరాత్రి మహిళపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా పోలీస్ కేస్ నమోదయింది. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి రెండు రోజుల క్రితం ఓ ముఫ్పై ఏళ్ల మహిళ నగరానికి వచ్చింది. గండి మైసమ్మ దగ్గర ఆ మహిళ ఒంటరిగా ఉండటం చూసిన నలుగురు కామాంధులు చెరబట్టాలని నిర్ణయించుకున్నారు. గండిమైసమ్మ లోని ఉజ్వల బార్ వెనకాల ఖాళీ ప్రదేశం ఉండటంతో మహిళను బలవంతంగా అక్కడకు తీసుకెళ్లారు. అత్యాచారం చేశారు. ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వేగంగా స్పందించారు. వారు వచ్చే సరికి ఆ నలుగురూ ఇంకా అత్యాచార ప్రదేశంలోనే ఉన్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఇమామ్ అనే ఇరవై ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గరు పరారయ్యారు. పరారైన వారిని కుద్దుస్, ఉమృద్ధిన్, నరసింహ గా గుర్తించారు. వీరంతా 23 ఏళ్ల లోపు యువకులే.
నిందితులు ఆటో డ్రైవర్లు
నిందితులు నలుగురూ ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. గండి మైసమ్మ సర్కిల్‌లో ఆటోలు పెట్టి నడుపుతూ ఉంటారు . నేర ప్రవృత్తి ఉండటంతో మహిళ ఒంటరిగా కనిపించడంతో లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు వీరిని గుర్తించి.. అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా మేడ్చల్ పోలీసులు అనేక సార్లు ఆటోడ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనేక సార్లు నేరారోపణలు .. డ్రైవర్లపై వచ్చాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కొంత మంది భయపడటం లేదు. ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆ మహిళను వైద్య చికిత్సల కోసం ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ బంధువులు ఎవరూ లేకపోతే.. మహిళాసంరక్షణ కేంద్రానికి పంపించే అవకాశం ఉంది.