Tandur Police arrests Psycho killer: హైదరాబాద్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో సంచలనం రేపిన మహిళల హత్యల కేసును పోలీసులు ఛేదించారు. మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేస్తున్న సైకో కిల్లర్ కిష్టప్ప ను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందట ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య కేసులో పోలీసులు నిందితుడ్ని  అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు మంది మహిళలను హత్య (Women Murder in Vikarabad District) చేసినట్లు పోలీసులు గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 
వికారాబాద్ జిల్లా తాండూరులో సైకో కిల్లర్ కిష్టప్ప వరుసగా మహిళల్ని హత్య చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల చివర్లో ఓ మహిళను హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి పడేశాడని పోలీసులు చెప్పారు. ఉపాధి పేరుతో ఇప్పటివరకూ ఆరుగురు మహిళ్ని జాబ్, పని పేరుతో రప్పించి కిడ్నాప్ చేస్తున్నాడు. ఆపై మహిళల్ని దారుణంగా హత్య చేసి శవాన్ని మూటకట్టి పడేస్తున్నాడని తెలిపారు. నవంబర్ 29న ఓ మహిళ అదృశ్యమైంది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆమె ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


ఈ క్రమంలో పోలీసులకు ఓ సీసీటీవీ ఫుటేజీ దొరికింది. అది పరిశీలించగా అదృశ్యమైన మహిళ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నట్లు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ధరూర్ మండలం పెద్దేముల్ గ్రామానికి చెందిన కిష్టప్పగా గుర్తించారు. తాను కేవలం ఆమెతో మాట్లాడాను కానీ, ఆ తరువాత ఏం జరిగిందో తెలియదన్నాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి తమదైనశైలిలో పోలీసులు విచారణ చేపట్టడంతో నిందితుడు అసలు విషయాన్ని చెప్పాడు. మహిళను అడవిలోకి తీసుకెళ్లి చీరను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని తాండూరు పోలీసులు వివరించారు. మహిళ వద్ద ఉన్న నగదు, కాళ్లకు ఉన్న వెండి పట్టీలు తీసుకుని పారిపోయినట్లు అంగీకరించాడు. గతంలో జిల్లాలో ఇదే తీరుగా నమోదైన కేసుల్లోనూ మహిళల్ని కిష్టప్పే హత్యచేసి ఉంటాడని పోలీసులు వరుస హత్యల కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.


ఇటీవల జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసుల్లో విచారణతో గతంలో జరిగిన మహిళ కిడ్నాప్, హత్యలు కిష్టయ్యే హత్య చేశాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఉపాధి పేరుతో మహిళల్ని నమ్మించి, కూలీ పనులు చేసే వారిని ఫోన్ చేసి రప్పించి హత్యలు చేస్తారని తెలుస్తోంది. మహిళ్ని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం చైన్, కాలికి ఉన్న పట్టీలు, నగదు తీసుకుంటాడు. మృతదేహాల్ని మూటకట్టి ఎవరికీ అనుమానం రాకుండా నిర్మానుష్యమైన ప్రాంతాల్లో పడేస్తాడని పోలీసులు చెబుతున్నారు. కూలీలు, ఉపాధి కోసం చేస్తున్న మహిళల్ని టార్గెట్ చేసి హత్యలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్ కిష్టప్పను ఇటీవల జరిగిన హత్య కేసులో అరెస్ట్ చేశారు.


Also Read: ప్రజాభవన్‌ వద్ద కేసీఆర్‌ పేరుపై మట్టిపూత- సెల్ఫీలు తీసుకుంటున్న సందర్శకులు - వద్దని వారించిన బండ్ల గణేష్