CI Arrest : హైదరాబాద్ లో మరో సీఐ రాసలీలలు వెలుగుచూశాయి. హైదరాబాద్ సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు అక్రమ సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. గుర్రం గూడ సమీపంలో చెట్ల పొదల్లో అర్ధరాత్రి కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్య అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో కొన్ని సీఐను ఆయన భార్య ఫాలో అవుతోంది. గురువారం అర్ధరాత్రి సీఐను పిల్లలతో సహా ఫాలో అయిన ఆయన భార్య మరో మహిళతో ఏకాంతం ఉన్న సమయంలో పట్టుకుంది. చెట్లపొదల్లో పిల్లల అరుపులు వినపడడంతో అటుగా వెళ్తోన్న పెట్రోలింగ్ పోలీసులు సీఐ వద్దకు వెళ్లారు. అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అతడు కానిస్టేబుల్ , హోంగార్డుపై దాడికి పాల్పడ్డాడు. సీఐ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీఐను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో పాటు సీఐను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2002 బ్యాచ్ కి చెందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. రాజు ఇన్స్పెక్టర్ సొంత ఊరు కందుకూరు మండలం బేగంపేట గ్రామం. ఇన్స్పెక్టర్ రాజుకి ఒక భార్య పాప, బాబు ఉన్నారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన రాజును పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం మత్తులో దాడి
సీఐ రాజు గురువారం రాత్రి ఓ మహిళను కారులో ఎక్కించుకొని గుర్రంగూడ శివారులోని చెట్లపొదల్లోకి వెళ్లగా అతడిని ఫాలో అయిన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న పెట్రోలింగ్ పోలీసులు పిల్లల అరుపులు విని అక్కడకు చేరుకుని రాజును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న రాజు తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్ పై దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో సీఐను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుళ్లు సీఐపై ఫిర్యాదు చేశారు. తనకు, తన పిల్లలకు అన్యాయం చేసిన తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ రాజు భార్య వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఇన్స్ స్పెక్టర్ రాజు ఐ ఫోన్ వాడుతున్నారు. సీఐ వివాహేతర సంబంధాన్ని ఆయన ఐ ఫోన్ బయటపెట్టింది. ఫైండ్ మై లోకేషన్ ద్వారా భర్త లోకేషన్ భార్య ట్రేస్ చేసింది. లోకేషన్ ద్వారా నేరుగా భర్త ఉన్న ప్రదేశానికి పిల్లలతో వెళ్లిన ఆమె భర్త మరో మహిళతో కారులో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తను ఈ విషయంపై నిలదీయడంపై అతడు దురుసుగా ప్రవర్తించాడు. పిల్లలు అరుపులు ఉన్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ రాజు పోలీసులపై దాడికి పాల్పడ్డడాడు.