Uttarakhand Crime News: ప్రేమ.. ఆ పదం వింటే కొందరు చాలా సంతోషంగా ఫీలవుతుంటారు. మరికొందరేమో భయపడిపోతుంటారు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కొందరు ప్రేమకు నో చెబితే దాడులు చేయడం, చంపేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అందుకే చాలా మంది ఈ పదం వింటేనే గజగజా వణికిపోతున్నారు. చిన్న పిల్లలు, తెలియని వాళ్లు, చదువూ, సంధ్యాలేని వాళ్లు, కళాశాల విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడడం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చూడబోయేది మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటారా.. లాయర్ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా లాయర్ ను ప్రేమించాడు. ఆమె ప్రేమకు అంగీకరించకపోవడంతో ఆమె ముక్కును కొరికేశాడు.
అసలేం జరిగిందంటే..?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన ఓ మహిళా లాయర్... 2018లో లాయర్ చంద్రశేఖర్ వద్ద ఇంటర్న్ షిప్ చేసింది. అయితే సదరు మహిళా న్యాయమూర్తిపై మనసు పడ్డ లాయర్ చంద్రశేఖర్.. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు బాధితురాలు నో చెప్పింది. అయినప్పటికీ అతను పట్టించుకోకుండా పోకిరిలా ఆమె వెంటపడ్డాడు.
ఇదిలా ఉండగా... సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాధితురాలు, లాయర్ చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. వేడుకలు ముగిసిన అనంతరం ఆమె కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా.. చంద్రశేఖ్ ఆమె స్కూటీని అడ్డుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె మళ్లీ నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన చంద్రశేఖర్.. ఆమె ముక్కును కొరికి, దాడి చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గాయపడ్డ బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదే ఏడాది జనవరిలో ఇలాంటి ఘటనే.. భర్త నాలుక కొరికేసిన భార్య
బలవంతంగా ఇంటికి తీసుకెళ్తున్నాడనే కోపంతో భర్త నాలుకను తన నోటితోనే కొరికేసిందో భార్య. నాలుక పూర్తిగా తెగిపోవడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కేు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో వెళ్లడం ఇష్టం లేకు నాలుక కొరికేసింది..
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ జిల్లాకు చెందిన సల్మా, మున్నా భార్యభర్తలు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే వీరిద్దరి మధ్యా గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య సల్మా పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. కొంతకాలంగా అక్కడే ఉంటోంది. ఈ క్రమంలోనే భార్యా, పిల్లలను తన ఇంటింకి తీసుకెళ్లేందుకు మున్నా అత్తింటికి వచ్చాడు. భర్తతో వెళ్లడానికి సల్మా నిరాకరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన భార్య,.. భర్త మున్నా నాలుకను తన నోటితో కొరికేసింది. నాలుక కింద తెగి పడగా.. మున్నా స్పృహ తప్పి పడిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని... మున్నాను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలానికి చేరుకొని సల్మాను కస్టడీలోకి తీసుకున్నారు.