US bride to be murdered in Punjab:  పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు హత్యకు గురయ్యారు. రూపిందర్ కౌర్ పంధేర్‌ను ఆమె పెళ్లి చేసుకోవాల్సిన  వరుడు చార్జిత్ సింగ్ గ్రెవాల్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ కిల్లర్ హత్య చేశాడు. . ఈ హత్య తర్వాత, ఆమె శరీరాన్ని స్టోర్‌రూమ్‌లో డీజిల్‌తో కాల్చి, బూడిదను కాలవలో పారవేశారు.          

Continues below advertisement


పెళ్లి చేసుకునేందుకు పంజాబ్ వచ్చిన అమెరికా సిటిజన్ రూపిందర్ కౌర్   


రూపిందర్ కౌర్ పంధేర్, అమెరికా నివాసి. పౌరసత్వం కూడా ఉంది.  యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో వివాహం కోసం జూలైలో లుధియానా జిల్లాలోని కిలా రైపూర్ గ్రామానికి వచ్చారు. గ్రెవాల్ ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి  భారతదేశానికి రప్పించాడు. అయితే, వివాహం జరగకముందే ఆమె జూలై 12-13 మధ్య రాత్రి కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్‌జీత్ సింగ్ సోనూ  చేతిలో హత్యకు గురైంది. సుఖ్‌జీత్, గ్రెవాల్ తో ఒప్పందం చేసుకుని  రూ. 50 లక్షలకు ఈ హత్య చేశాడు. పోలీసుల విచారణలో, సుఖ్‌జీత్ సింగ్ తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని డీజిల్‌తో కాల్చి, ఆ తర్వాత శరీర బూడిదను చల్లబరచడానికి నీటితో చల్లి, లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు వెల్లడించాడు. పోలీసులు ఆ ప్రాంతంలో కొంత ఎముకలను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు.      


కాంట్రాక్టర్ కిల్లర్‌తో మర్డర్ చేయించిన కాబోయే భర్త                     


రూపిందర్ కౌర్ జూలైలో లుధియానాకు చేరుకున్న తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అమెరికాలో ఉండే ఆమె సోదరి కమల్ కౌర్ ఖైరా  ఆమెతో సంప్రదింపులు జరపలేకపోవడంతో జూలై 28న భారతదేశంలోని అమెరికన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారు. ఎంబసీ ఈ సమస్యను స్థానిక పోలీసులకు నివేదించడంతో విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 18న  రూపిందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలో అపహరించారని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ హత్య చేసినట్లుగా నిజం చెప్పలేదు. కానీ పోలీసులు సుఖ్‌జీత్‌ పై అనుమానంతో  అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు హత్యను అంగీకరించాడు.            


సంచలనం సృష్టించిన హత్య కేసు             
 
 రూపిందర్ కౌర్ గ్రెవాల్‌తో సంబంధం ఉన్న ఖాతాలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేసినట్లు తేలింది. పోలీసులు ఆర్థిక లాభమే ఈ హత్యకు ప్రధాన ఉద్దేశమని నమ్ముతున్నారు.  లుధియానా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్‌ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. గ్రెవాల్ మరియు అతడి సోదరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన అమెరికా, యూకే మరియు భారతదేశంలోని ఎన్ఆర్ఐ సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.