Tata Nexon Diesel GST New Price: GST రేట్ల తగ్గింపు తర్వాత, ప్రజలు కోరుకున్న కారును కొనడం కొంచెం సులభంగా మారింది. కొత్త GST స్లాబ్ కింద, 1200 cc కంటే తక్కువ పెట్రోల్ ఇంజిన్‌ & 1500 cc కంటే తక్కువ డీజిల్ ఇంజిన్‌ కలిగిన కార్లపై & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్లపై GST తగ్గించారు. ప్రస్తుతం ఈ వాహనాలపై 28 శాతం GST ఉండగా, దానిని 18 శాతానికి తగ్గించారు. జీఎస్టీ శ్లాబ్‌ ట్రిమ్మిగ్‌తో, అన్ని కార్లతో పాటు, టాటా నెక్సాన్ డీజిల్ SUV కూడా చవకగా మారింది. ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUV లలో ఒకటి & దీని డీజిల్ మోడల్ ఇప్పుడు కేవలం రూ. 9 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ఈ కొత్త రేటు ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 

టాటా నెక్సాన్ డీజిల్‌ SUV రీసెంట్‌ లుక్స్‌ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కారు ముందు భాగంలో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, అగ్రెసివ్‌ గ్రిల్‌ స్పోర్టీ ఫీలింగ్‌ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో డ్యూయల్‌ టోన్‌ అలాయ్ వీల్స్‌ & కట్‌ క్రీజ్‌ లైన్స్‌ కారు డిజైన్‌కి స్టైలిష్ అప్పీల్‌ తెస్తాయి. కారు వెనుక భాగంలో LED టెయిల్‌ ల్యాంప్స్‌ & క్రిస్టల్‌ లుక్‌ ఎలిమెంట్స్‌ ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. మొత్తంగా, నెక్సాన్ డీజిల్‌ డిజైన్‌ కంఫర్ట్‌తో పాటు ఆధునిక SUV తరహా స్టైల్‌ను అందిస్తోంది.

టాటా నెక్సాన్ డీజిల్ SUV లో చాలా వేరియంట్లు ఉన్నాయి. అందువల్ల, GST తగ్గింపు తర్వాత ఏ వేరియంట్ ఎంత చౌకగా ఉంటుందో తెలుసుకోవడం కస్టమర్‌కు చాలా ముఖ్యం. 

ఏ వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తుంది?

*  టాటా నెక్సాన్ డీజిల్ స్మార్ట్ + 1.5 లీటర్‌ వేరియంట్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు (Tata Nexon Diesel ex-showroom price, Hyderabad Vijayawada) . ఇప్పుడు, కొత్త GST శ్లాబ్‌ తర్వాత ఈ రేటు రూ. 99,100 తగ్గింది. 

*  స్మార్ట్ + S వేరియంట్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.29 లక్షలు కాగా, GST తగ్గింపు తర్వాత రూ. 9.27 లక్షలు అయింది. 

*  ప్యూర్ + వేరియంట్ ధర రూ. 10.99 లక్షలుగా ఉంటే, కొత్త జీఎస్‌టీ ప్రకారం రూ. 9.90 లక్షలు అయింది.

*  టాటా నెక్సాన్ డీజిల్ ప్యూర్ + ఎస్ వేరియంట్ పాత (ప్రస్తుత) ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.29 లక్షలు అయితే, దానిని రూ. 10.17 లక్షలకు తగ్గించారు. 

*  క్రియేటివ్ వేరియంట్ ధర రూ. 12.39 లక్షలు కాగా, కొత్త జీఎస్టీ శ్లాబ్‌ తర్వాత అది ఇప్పుడు  రూ. 11.17 లక్షలకు దిగి వచ్చింది. 

*  క్రియేటివ్ + ఎస్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 12.69 లక్షలుగా ఉండేది, ఇప్పుడు దానిని రూ. 11.44 లక్షలకు తగ్గించారు. 

*  క్రియేటివ్ + PS DT వేరియంట్ ధర రూ. 13.69 లక్షలుగా ఉండగా, ఇప్పుడు దానిని రూ. 12.34 లక్షలకు తగ్గించారు.

కొత్త రేట్లను, అందిస్తున్న ఫీచర్లను, మీ అవసరాన్ని బట్టి నెక్సాన్‌ డీజిల్‌లో మీకు ఇష్టమైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.