కొందరు చిరు వ్యాపారస్తులు అప్పుడప్పుడు చేసే పనులు చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇతరులు ఎంతో ఇష్టపడి తీసుకునే ఆహారం పట్ల ఎంతో నీచంగా వ్యవహరిస్తుంటారు. ఆకు కూరలు, కూరగాయాలు అమ్మే వ్యక్తులతోపాటు చిరు తిండి అమ్మే వ్యాపారస్తుల వరకు ఎక్కడో ఒక చోట అస్సలు శుభ్రత పాటించకపోగా.. అశుద్ధపు పనులు చేస్తుంటారు. కొంత మంది కాళ్లతో పిండి కలపడం చూస్తుంటాం. మరికొంత మంది తమ చెమటతోపాటు అశుభ్రమైన చేతులతోనే తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా దర్శనం ఇస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణమైన వీడియో వెలుగులోకి వచ్చింది.   


ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన చూస్తే.. కోపంతో రగిలిపోవడం ఖాయం. ఓ వీధి వ్యాపారి కూరగాయలపై మూత్రం పోసి, ఉమ్మివేసి అమ్మడం సంచలనంగా మారింది. బరేలీ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న షరీఫ్ ఖాన్‌ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. గత 30 ఏళ్లుగా ఆయన కూరగాయలు అమ్ముతూ జీవితం కొనసాగిస్తున్నాడు. తోపుడు బండి మీద కూరగాయలను పెట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ అమ్ముతుంటాడు. స్థానికుల నుంచి ఇప్పటి వరకు ఇతడిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఎప్పటి మాదిరిగానే తాజాగా కూరగాయలు అమ్మేందుకు తోపుడు బండితోపాటు వీధిలోకి వచ్చాడు. ఎవరూ లేని ప్రాంతానికి చేరుకోగానే బండిని పక్కన నిలిపాడు. ముందుగా కూరగాయల మీద ఉమ్మి వేశాడు. ఆ తర్వాత కొన్ని కూరగాయాలను తీసుకుని వాటిపై మూత్రం పోశాడు. అనంతరం వాటిని అమ్మడం మొదలు పెట్టాడు.





అదే సమయంలో అటుగా కారులో వెళ్తున్న దుర్గేష్ గుప్త అనే వ్యక్తి షరీష్ ఖాన్ నీచపు పనిని ఫోన్ లో వీడియో తీశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే స్థానికులు అతడి వీపు విమానం మోత మోగించారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దుర్గేష్ వీడియోను ఆధారంగా చేసుకుని  నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో షరీఫ్ ఖాన్ తప్పను ఒప్పుకున్నాడు. ‘‘నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి. ఇక మీద ఇలాంటి తప్పు చేయను’’ అంటూ పోలీసులను వేడుకున్నాడు. అనంతరం అతడిని రిమాండ్ కు పంపిచారు.


అటు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగా ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు అంటే నచ్చకే ఇలాంటి పని చేశాడని హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. విక్రయదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, బండిపై వారి పూర్తి వివరాలు రాయాలని కోరారు. ఈ ఘటనల యూపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.