UP Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన తల్లితో పాటు భార్యని, పిల్లల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కుటుంబంలోని ఐదుగురుని చంపి ఆ తరవాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పలాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మానసిక వైకల్యంతో బాధ పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. తల్లిని తుపాకీతో కాల్చి చంపిన నిందితుడు ఆ తరవాత భార్యను సుత్తితో దారుణంగా కొట్టాడు. ఈ ఇద్దరూ చనిపోయారని కన్‌ఫమ్ చేసుకున్నారు ముగ్గురు పిల్లల్ని ఇంటిపై నుంచి కిందకు తోసేశాడు. తరవాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిందితుడు మద్యానికి బానిసయ్యాడని వెల్లడైంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోయి అందరినీ హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. 

"ఓ 45 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురినీ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ తరవాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. భార్యని, తల్లిని, ముగ్గురు పిల్లల్ని చంపినట్టు విచారణలో తేలింది. పోలీసులతో పాటు ఫోరెన్సిక్ టీమ్‌ కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది"

- పోలీస్ ఉన్నతాధికారి