UP Crime News: పిల్లలకు ఉన్నత విలువలు నేర్పించి.. అత్యున్నతమైన శిఖరాలకు చేరుకునేలా చేసే ఓ గురువే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టూర్ తీసుకెళ్తా రమ్మంటూ తొమ్మిది మంది బాలికలను వెంట బెట్టుకొని వెళ్లాడు. అక్కడే ఓ హోటల్ లో బాలికకు మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు.

  


ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ నవంబర్ 23వ తేదీన తొమ్మిది మంది విద్యార్థినులను టూర్ కోసం బృందావన్ కు తీసుకెళ్లాడు. రాత్రి పూట బస చేసేందుకు ఓ హోటల్ లో రెండు గదులను అద్దెకు తీసుకున్నాడు. ఎనిమిది మంది విద్యార్థినులను ఒక గదిలో ఉంచగా.. మరో గదిలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికతోపాటు అతడు కూడా ఉన్నాడు. విద్యార్థిని తినే ఆహారంలో మత్తు మందు కలిపిన ప్రిన్సిపల్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక ప్రతిఘటించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. 


ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తాననే కాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్టు హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ తెలిపారు. అయితే విద్యార్థులు అంతా నవంబర్ 24వ తేదీన ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. బాధితురాలు తొలుత ఈ ఘటనపై మౌనంగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత తనపై జరిగిన ఈ దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాబాయ్ లు..


మృగాళ్ల చేతిలో నిత్యం ఆడబిడ్డల బతుకులు తెల్లారిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగం వరసకు కూతురు అయ్యే చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరు కూడా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో పదో తరగతి బాలికపై సొంత బాబాయ్ మరో ఇద్దరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేశారు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌ కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో బాలికపై కన్నేసిన బాబాయ్ శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసి పరారయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


గ్రామంలో ఉద్రిక్తత..


వారంతా వరుసకు బాబాయ్‌లు, అయినా ఆ చిన్నారిని వదల్లేదు. చిన్నారిపై దారుణానికి పాల్పడేందుకు సమయం కోసం ఎదురు చూశారు. బాబాయ్‌ అంటూ వచ్చిన ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. తమ కోరిక తీర్చుకుని అతి కిరాతకంగా హత్య చేశారు. వరుసకు బాబాయ్‌ లు అయినా ఇంత కిరాతకానికి ఒడిగట్టడం, ఆ తర్వాత విషయం బయటచెబుతుందని చిన్నారిని హత్య చేశారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో గ్రామస్తులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. వారి వాహనాలు, ఇంట్లో సామాగ్రికి నిప్పుపెట్టారు.