Two youths killed each other in  Vijayawada:  హత్యలు జరుగుతాయి. చంపేసినోడు పారిపోతాడు.కానీ విజయడవాలో మాత్రం ఇద్దరు తాగుబోతులు.. మద్యం మత్తులో తామేమి చేసుకుంటున్నారో కూడా తెలియనంతగా తాగేసి కత్తులతో పొడుచుకున్నారు. ఇద్దరూ చనిపోయారు. విజయవడాలోని  గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద బుధవారం ఈ డబుల్ మర్డర్స్ జరిగాయి. అక్కడికి సమీపంలో ఓ గదిలో నివాసం ఉంటున్న  ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణ ఒక గదిలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. రక్తపు మడుగులో మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు.

మొదట ఈ ఇద్దర్ని వేరే వ్యక్తి చంపాడని అనుకున్నారు.  రౌడీ షీటర్ కిషోర్ మద్యం, గంజాయి మత్తులో ఈ హత్యలు చేసినట్లు  అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో   ఇద్దరు యువకుల మధ్య పరస్పర దాడిగా భావిస్తున్నారు.  మృతదేహాలను విజయవాడ జనరల్ హాస్పిటల్ (GGH ) మార్చురీకి తరలించారు.  పోలీసులు ఈ ఘటనకు ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. చనిపోయిన వారు ఎవరు అన్నదానిపై పోలీసులు ఇంకాఎలాంటి వివరాలు వెల్లడించలేదు. వారు గంజాయి బ్యాచ్ సభ్యులని అనుమానిస్తున్నారు.