Andhra Crime News :  అపార్టుమెంట్‌లో కలిసి మెలిసి ఉండటం అనేది అసాధ్యం. ఒక్క అపార్టుమెంట్‌లో ఇరవై ఫ్లాట్లు ఉంటే భిన్నమైన మనుషుల మధ్య అభిప్రాయబేధాలు వస్తూంటాయి. అయితే అవి హత్యల వరకూ వెళ్లడం మాత్రం అరుదే. తిరుపతిలో ఇద్దరు ఎదురెదురుగా ఉండే ఫ్లాట్ల యజమానుల మధ్య ఏర్పడిన వివాదం చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. ఓ ఇంటి యజమాని చావుబతుకుల్లో ఆస్పత్రి పాలైతే.. మరో ఇంటి యజమాని జైలు పాలయ్యారు.  


నివాసం ఉండే అపార్టు మెంట్ ఎదు టే శివారెడ్డిపై హత్యాయత్నం                                       
  
ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది.  ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివారెడ్డి పోలీసులకు ఏ వివరాలు చెప్పలేకపోయారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు.   శివారెడ్డి నివాసం ఉండే ఆపార్ట్ మెంట్ ముందే బైక్ తో శివారెడ్డిని అడ్డగించి  ఇద్దరు వ్యక్తులు దాడి చేసినటల్ుగా గుర్తించారు.  మొద్దు కత్తితో తలపై నరకడంతో శివారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. 


ఎదురు ఫ్లాట్‌లో ఉండే టీటీడీ ఉద్యోగి శ్రీలక్ష్మి దంపతులు దాడి చేసినట్లు గుర్తింపు                                           


అయితే హత్యాయత్నం చేసిందెవరో సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా లేకపోవడంతో పోలీసులు శివారెడ్డితో  శత్రుత్వం ఉన్నది ఎవరితోనే ఆరా తీశారు. వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శివారెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిలో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఆరా తీస్తే.. వారిద్దరూ శివారెడ్డి ఫ్లాట్ ఎదురుగా నివాసం ఉండే శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి అని తేలింది. శ్రీరిలక్ష్మి టీటీడీలో డిప్యూటీ  ఈఈగా పని చేస్తున్నారు. 


చిన్న చిన్న విషయాలతో గొడవలు పడి హత్యాయత్నాల వరకూ సీన్                          


ఎదురెదురు ఫ్లాట్లలో నివాసం ఉండటంతో అనేక విషయాలపై ఇరు కుటుంబాల మధ్య తరచూ వివాదాలు వస్తున్నాయి. శివారెడ్డి, శ్రీలక్ష్మి ఈ విషయంలో అనేక సార్లు గొడవ పడ్డారు.రెండు కుటంబాల వారు సమస్యల విషయంలో వెనక్కి తగ్గకుండా ఈగో సమస్యలకు పోవడంతో అవి అంతంకకూ పెరిగుతూ పోయాయి. చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. శివారెడ్డి ఇంకా ప్రాణాపయం నుంచి బయటపడలేదు. పోలీసులు ఈ కేసు విషయంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీలో మంచి ఉద్యోగంలో ఉన్న శ్రీలక్ష్మి తన భర్తతో సహా.. క్షణికావేశంతో  హత్యాయత్నం చేసి జైలు పాలయింది. మరో వ్యక్తి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టారు.