Tirumala Man Murder: తిరుమలలో దారుణం జరిగింది. ఎస్వీ మ్యూజియం వద్ద ఓ వ్యక్తి నిద్రిస్తుండగా మరోక వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన తిరుమలలో కలకలం రేపుతుంది. విషయం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్ళితే.. భక్తుల ముసుగులో శరవణ, భాస్కర్ అనే ఇద్దరు జేబు దొంగలు తిరుమలలో ఉండేవారు. తమిళనాడు రాష్ట్రం, ఆరని జిల్లాకు చేందిన శరవణ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొంగతనం చేసిన తరువాత తిరుమల కొండకు వచ్చి కొద్ది రోజులు పాటు ఇక్కడే వాడేవాడు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తంకు చేందిన భాస్కర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తిరుమలలో ఉచిత అన్నదానంలో భోజనం చేసి అక్కడే రోడ్డుపై బస చేసే వారు. అయితే నిన్న రాత్రి మ్యూజియం ఎదురుగా ఉన్న సీనియర్ సిటిజన్ క్యూలైన్స్ వద్ద బస చేశారు. అయితే శరవణా భాస్కర్ మధ్య నిద్రించే స్ధలంపై వాగ్వాదానికి దిగ్గారు.
దీంతో భాస్కర్ ని పోలీసులకు పట్టిస్తానని శరవణ బెదించాడు. తిరుమలలో గానీ, తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్ కి పంపుతానని చెప్పడంతో భయందోళనకు గురైన భాస్కర్, శరవణ ఎక్కడ పోలీసులకు పట్టిస్తాడో అన్న భయంతో నిన్న అర్ధరాత్రి 1:10 సమయంలో నిద్రిస్తున్న శరవణాపై భాస్కర్ బండరాయితో మోది హత్య చేసి అక్కడి నుండి పరార్ అయ్యాడు. అయితే భక్తుల సమాచారం మేరకు ఉదయం నాలుగు గంటలకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా రెండు గంటల వ్యవధిలో నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని ఆశ్విని ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే భాస్కర్, శరవణలపై తిరుమల పోలీసు స్టేషనులో గతంలోనే దొంగతనం కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు.