Tirumala Crime News: తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలోని హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు చూస్తుండగానే, సినిమాలోని ఘటనని తలపించే విదంగా కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడైన సతీష్ తో సహా ఏడుగురు వ్యక్తులు పద్మనాభం అన్నే వ్యక్తి పై కత్తులతో దాడి చేయగా, వీరి నుంచి తప్పించుకున్నే క్రమంలో పద్మనాభం భయపడి పోలీస్ కాంప్లెక్స్ లోకి పరుగులు తీసాడు
సతీష్ బ్యాచ్ చేసిన ఈ కత్తి దాడిలో బాధితుడు పద్మనాభం చేతి, వీపుపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకపోక పోవడంతో దాడి చేసిన నిందితులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. దాడి ఘటనని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఒకరిపై కత్తులతో దాడి ఘటన జరగడం తిరుమల భద్రతలోని డోల్లతనాని బట్టబయలు చేసింది. ఈ ఘటనని చూసిన భక్తులు ఎప్పుడు, ఎక్కడ నుంచి ఎవరైనా దాడి చేస్తే రక్షణ ఉంటుందా లేదా అని తిరుమలలో హాట్ టాపిక్ అవుతోంది.
ఏడుకొండలపై భక్తుల కిటకిట
వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.ఆదివారం రోజున 82,582 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 43,526 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 3.19 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్మెంట్లు భక్తులతో నిండి పోయి బయట ఏటిజీహెచ్ వరకూ క్యూ లైన్స్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.
సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేయడం తెలిసిందే.