Road accident in Anantapur district | అనంతపురం:  అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగంగా చెట్టును కారు ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారం తో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.




కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి వారిని గుర్తించారు. మంచు కురవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులలో ఇద్దరు వైద్యులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరందరూ కూడా బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ అని పోలీసులు గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందిన ఘటన మరువక ముందే ఈ ప్రమాదం మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.


Also Read: Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్