Guntur News : ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో కొండ పై ఉన్న అత్యంత పురాతనమైన 700 సంవత్సరాల చరిత్ర ఉన్న వినాయకుడి విగ్రాహాన్ని పగలగొట్టారు. గుప్త నిధుల కోసమే విగ్రహాన్ని బ్రైక్ చేసినట్లు భావిస్తున్నారు స్థానికులు. విగ్రహం బొజ్ఝలో వజ్రాలు ఉంటాయి అన్న నమ్మకంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ ఆలయం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న కృష్ణదేవరాయల కాలం నాటి ఓ పురాతన వినాయకుడి విగ్రహాన్ని ఆగంతకులు నిన్న రాత్రి ధ్వంసం చేశారు. గణేశ్ విగ్రహం పొట్టను పగులగొట్టి గుప్త నిధుల కోసం వెతికారు. అవి దొరక్కపోయే సరికి అక్కడి నుంచి వారు ఉడాయించినట్లు తెలుస్తోంది. ఇలా విగ్రహం పగులగొడితే గుప్త నిధులు దొరుకుతాయని ఎవరు చెప్పారో తెలియదు కానీ దుండగులు మాత్రం పురాతన విగ్రహాన్ని పగులకొట్టేశారు.
గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేసే ముందు పూజలు నిర్వహించారు. విగ్రహం చుట్టు పసరు పోసీ అతర్వాత విగ్రహం నడుచుట్టు కొత్త దోవతి కట్టి ఆతర్వాత పొట్టను ఉలితో పగల గొట్టారు.స్తానికంగా ఉండే గ్రామస్తులు శుభకార్యాలు, పంటలఏరువాక ముందు గణపతి ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. ఈ చుట్టు పక్కల గ్రామాలలో ఏ శుభ కార్యం జరగాలన్నా స్వామి వారిిని దర్శించి ప్రారంభిస్తారు. భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ విగ్రహాన్ని ఇలా కూల్చివేయడం భక్తులను దిగ్భ్రాంతికిగురిచేసింది.
ఈ ఘటనను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండింారు. ఫిరంగిపురంలోని వినాయకుడి గుడిలో విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేశారంటూ విష్ణు తెలిపారు. గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయని, కానీ వైసీపీ సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరిగిందన్నారు. వినాయకుడి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు.
ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో బాగా తెలిసిన వాళ్లు చేసిన పనిగా భావిస్తున్నారు. గణపయ్య బొజ్జలో విగ్రహాలు ఉంటాయనికొంత కాలంగాప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా సరైన భద్రతను ఏర్పాటు చేయకపోవడంతో అత్యాశాపరులు ఈ పనికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు గప్త నిధులు తవ్వే అలవాటున్న వారిని గుర్తించి ప్రశ్నిస్తున్నారు.