Kurnool News :   కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ లో 105 కిలోల వెండి చోరీ కేసును పోలీసులు చేధించారు.  ఇంటి దొంగలపనేనని నిర్ధారించారు.  మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ బాబులను శనివారం అరెస్టు పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన భరత్ సింహా, విజయ భాస్కర్ లను కూడా అరెస్టు చేశారు.  నిందితుల వద్ద నుంచి రూ. 10 లక్షల నగదు, 81.52 కేజిల వెండి సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్  ప్రకటించారు. 






 
 
27 జనవరి 2021 తేదీన అప్పటి సీఐ విక్రమ్ సింహా, పోలీస్ స్టాఫ్ తో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేసినప్పుడు తమిళనాడుకు చెందిన  భారతి గోవింద రాజ్ అనే వ్యక్తి బిల్లులు లేకుండా తీసుకెళ్తున్న  రూ. 2,05,000 నగదు, 105 కేజి ల వెండి వస్తువులు కనిపించాయి. వాటిని  పోలీస్ ప్రొసీడింగ్ ద్వారా సీజ్ చేశారు.  దాని మీద చర్య తీసుకొనుటకు వాణిజ్య పనుల శాఖకు లేఖ రాశారు. వారు వెరీఫై చేసి  రూ. 35 లక్షలు పెనాల్టీ వేశారు.   బాధితులు పెనాల్టీ చెల్లించేందుకు తన వద్ద సొమ్ము లేకపోవడంతో వెండి తీసుకునేందుకు ఆలస్యం చేశారు.                                               


ఆ సొమ్మును తమ ఆదీనంలో ఉంచుకున్న అప్పటి రైటర్ రమణ బాబు , వెండి వస్తువులను  రూ. 2,05 లక్షల నగదును పై అధికారులకు తెలియకుండా స్వంత ఖర్చులకి వాడుకున్నారు.  కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయ్యాక ఇక..  ఆ వ్యాపారి ఆ వెండి వస్తువులను తీసుకెళ్లడని అనుకుని మరో కానిస్టేబుల్ అమరావతితో కలిసి స్వాహా చేయాలని నిర్ణయించుకున్నారు.  స్టేషన్లోని వెండిని దొంగతనం చేసి పంచుకున్నారు.    ఆ వెండిని తన మరిది భరత్ సహాయంతో   నగదుగా మార్చుకున్నారు. వచ్చిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారు.                  


 ఆ తరువాత తన సొమ్ము కోసం యజమాని , వాణిజ్య‌ పనుల శాఖ వేసిన ఫైన్ కట్టి, రిలీజ్ ఆర్డర్ పొంది .. స్వాధీనం చేసుకునేందుకు స్టేషన్ కు వచ్చాడు. తీరా వచ్చే సరికి అక్కడ ఉండాల్సిన వెండి , నగదు లేదు. దీంతో గగ్గోలు రేగింది. చివరికి పోలీసులు విచారణ జరిపి ఇంటి దొంగల పనేనని నిర్ధారించుకున్నారు.  వారి వద్ద నుంచి రూ. 10 లక్షల నగదు, 81.52 కేజి ల వెండి ని స్వాధీనపరుచుకున్నారు.