ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని 24 రోజుల పాటు ఫ్రిజ్‌లోనే ఉంచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. తన కొడుకు మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని.. నిజమేంటో తెలిసే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని సదరు తండ్రి తెలిపారు. ఈ ఘటన యూపీలోని సుల్తాన్‌పుర్‌ జిల్లా మజావున్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివాంక్‌ (32) ఢిల్లీలోని ఒక కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నాడు. 2012 నుంచి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగం చేసే సయమంలోనే అక్కడ గుర్లీన్‌ కౌర్‌ అనే యువతితో శివాంక్ కు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో వీరు 2013లో వివాహం చేసుకున్నారు.


అనుమానాస్పద రీతిలో మృతి..
కారణాలేంటే తెలియదు కానీ ఈ నెల 1వ తేదీన శివాంక్‌ మృతిచెందాడు. శివాంక్‌ అనుమానాస్పద రీతిలో కన్నుమూయడంతో తండ్రి శివ్‌ప్రతాప్‌ పాఠక్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఖరేబార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివాంక్ మృతదేహాన్ని పరిశీలించారు. ఢిల్లీలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. అతడి తండ్రికి అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి అక్కడి స్థానికి కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. ఆగస్టు 18వ తేదీన వీరి పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. 
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల వారికి అలర్ట్


శివాంక్‌ శవాన్ని గ్రామానికి తీసుకొచ్చిన శివ్‌ప్రతాప్‌ అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేదు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించాడు. ఆస్తి కోసం తన కోడలే హత్య చేసి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో వాస్తవాలు బయటపడేవరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదని స్పష్టం చేశాడు. అంతే ఆ రోజు నుంచి సరిగ్గా 22 రోజుల పాటు తన ఇంట్లో ఉన్న డీప్‌ ఫ్రిజ్‌లో కుమారుడి శవాన్ని భద్రపరిచాడు.


కలెక్టర్ ఎంట్రీతో వెలుగులోకి.. 
మృతదేహాన్ని ఖననం చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నారనే విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సోమవారం అధికార యంత్రాంగంతో చర్చించారు. శివాంక్ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం అధికారులను ఆదేశించారు. దీంతో వైద్యల బృందం శివాంక్ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించింది. ఈ నివేదిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 


Also Read: Biryani Theft: బిర్యానీ కోసం దొంగగా మారిన బాలుడు... చిరుతిళ్ల కోసం తాళం వేసిన ఇళ్లే లక్ష్యం... ఒకే పీఎస్ లో 10 కేసులు


Also Read: AP Crime: ఏపీలో ఘోరం.. చాక్లెట్‌ ఇప్పిస్తానని ఆశచూపి.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి..!